News February 19, 2025

అనకాపల్లి: ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ పునరుద్ధరణ

image

నిర్మాణ పనుల కారణంగా రద్దు చేసిన ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌(18519/18520)ను పునరుద్ధరించనున్నట్లు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు. ఈనెల 20న విశాఖ-ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ (18519), తిరుగు ప్రయాణంలో ఎల్‌టీటీ-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (18520) ఈనెల 21న షెడ్యూల్‌ ప్రకారం యథావిధిగా రాకపోకలు సాగిస్తాయన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ నుంచి దువ్వాడ, విజయవాడ మీదుగా ముంబై వెళ్తుందన్నారు.

Similar News

News October 18, 2025

HYD: ఆటోవాలాకు ‘దీపావళి పండుగ’

image

బీసీల 42% రిజర్వేషన్‌ బిల్లుపై హైకోర్టు స్టే విధించడంతో అన్ని పార్టీలు ఏకకంఠంగా తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో ఆర్టీసీ చక్రాలు ఆగిపోయాయి. బస్టాప్‌లు ఆటోలతో కిక్కిరిశాయి. పాఠశాలలు మూతపడి, ఉద్యోగాలు కొనసాగడంతో ఆటోల డిమాండ్‌ ఆకాశాన్నంటింది. ప్రయాణికులు డబుల్‌ ఛార్జీకి ఒప్పుకోవాల్సి వచ్చింది. అకస్మాత్తుగా పడిన ఈ అదృష్టంతో ఆటోవాలకు ముందుగానే ‘దీపావళి’ వెలుగొచ్చిందని సంబరపడుతున్నారు.

News October 18, 2025

ఈనెల 23న OTTలోకి ‘OG’

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కించిన ‘OG’ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈనెల 23న ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్‌కు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. గత నెల 25న రిలీజైన ఈ మూవీ సరిగ్గా 4 వారాల్లోనే OTTలోకి రాబోతోంది.

News October 18, 2025

APPLY NOW: NTPCలో ఉద్యోగాలు…

image

NTPC లిమిటెడ్‌లో 10 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఈనెల 21 ఆఖరు తేదీ. బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై, న్యూక్లియర్ ఫీల్డ్‌లో పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PwBD, మహిళలు ఫీజు చెల్లించనవసరం లేదు. రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://careers.ntpc.co.in/