News February 19, 2025
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్

వేసవిలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వివిధ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నుంచి ఇతర ముఖ్య కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికారులతో సాగు, తాగునీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజా పాలన, రైతు భరోసా, యూరియా కొరతపై కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు.
Similar News
News November 3, 2025
మూల మలుపు.. ఓవర్ స్పీడ్ ప్రమాదానికి కారణం?

మీర్జాగూడ ప్రమాదంపై రవాణా శాఖ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇటు బస్సు, అటు టిప్పర్ రెండు ఓవర్ స్పీడ్‌తో వచ్చాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనికి తోడు ప్రమాదం జరిగిన ప్రాంతంలో మూల మలుపు కూడా ఉందని, దీంతో రెండు వాహనాలు ఢీ కొట్టగానే కంకర మొత్తం ప్రయాణికుల మీదకు వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. కంకర కూడా ఓవర్ లోడ్ కావడంతో.. బరువు పెరిగి అదుపుతప్పినట్లు అంచనా వేస్తున్నారు.

జనగామ జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలు

జనగామ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 42.2 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పాలకుర్తిలో 2.8, జఫర్‌గఢ్ 3.8, కొడకండ్ల 8.2, తరిగొప్పుల 15.2, నర్మెట్ట 8.6, జనగామ 1.4, రఘునాథపల్లి 1.2, లింగలఘనపూర్ 1.0మి.మీ వర్షపాతం నమోదయిందన్నారు.