News February 19, 2025
NRPT: పాపం పసిపాప.. అప్పు తెచ్చినా బతకలేదు

వేడి నీరు పడి తీవ్రంగా గాయపడిన చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నర్వ మండలంలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. మండలానికి చెందిన మనీష, రాజేశ్ దంపతులకు ఐదు నెలల తనుశ్రీ ఉంది. నెల క్రితమే చిన్నారికి నామకరణం చేశారు. ఈనెల 13న మనీష కుమార్తెను ఎత్తుకుని, వేడి నీటి బకెట్‌ని తీసుకెళ్తుండగా జారిపడింది. ఆ నీరు పడి తల్లీకుమార్తెకు గాయాలయ్యాయి. దాదాపు రూ.2.5లక్షల అప్పుచేసి, చూపించినా పాప దక్కలేదు.
Similar News
News October 17, 2025
సిరిసిల్ల: సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్

సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని సిరిసిల్ల అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణపై IKP సెంటర్ల బాధ్యులకు శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం గ్రే ఏడు రకానికి రూ.2389, కామన్ రకానికి రూ.2369 ధరను ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టం చేశారు. సన్నరకం ధాన్యం క్వింటాలకు అదనంగా రూ.500 ప్రభుత్వం ఇస్తుందన్నారు.
News October 17, 2025
చిత్తూరు: విద్యుత్ షాక్ తగిలి యువకుడి మృతి

తెలంగాణ(S) కామారెడ్డి(D) నాగిరెడ్డి పేటలో శుక్రవారం విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు(D) రామసముద్రం గ్రామానికి చెందిన సయ్యద్ చోటు బాతులను మేపుకుంటూ వెళ్తుండగా కొన్ని బాతులు పొలంలోకి వెళ్లాయి. వాటిని తీసుకురావడానికి వెళ్లగా పొలంలో స్టాటర్ డబ్బా వైర్లు అతని కాలుకు తగిలి షాక్‌కు గురయ్యాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News October 17, 2025
జమ్మికుంట: క్వింటా పత్తి ధర రూ.6,800

జమ్మికుంట పత్తి మార్కెట్‌లో పత్తి ధర శుక్రవారం రూ.6,800 పలికింది. ఈరోజు మార్కెట్‌కు రైతులు 159 వాహనాల్లో 1238 క్వింటాల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా.. రూ.5,000, నుంచి రూ.6,800 దాకా పలికింది. గోనె సంచుల్లో 31 మంది రైతులు 43 క్వింటాలు తీసుకురాగా.. రూ.4,800, నుంచి రూ.6,000 దాకా పలికింది. రేపటి నుంచి మార్కెట్‌కు వరుసగా 4 రోజులు సెలవు ఉంటుందని మార్కెట్ కార్యదర్శి మల్లేశం తెలిపారు.