News February 19, 2025
NRPT: పాపం పసిపాప.. అప్పు తెచ్చినా బతకలేదు

వేడి నీరు పడి తీవ్రంగా గాయపడిన చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నర్వ మండలంలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. మండలానికి చెందిన మనీష, రాజేశ్ దంపతులకు ఐదు నెలల తనుశ్రీ ఉంది. నెల క్రితమే చిన్నారికి నామకరణం చేశారు. ఈనెల 13న మనీష కుమార్తెను ఎత్తుకుని, వేడి నీటి బకెట్‌ని తీసుకెళ్తుండగా జారిపడింది. ఆ నీరు పడి తల్లీకుమార్తెకు గాయాలయ్యాయి. దాదాపు రూ.2.5లక్షల అప్పుచేసి, చూపించినా పాప దక్కలేదు.
Similar News
News November 6, 2025
నేటి నుంచి యథావిధిగా పత్తి కొనుగోళ్లు: వరంగల్ కలెక్టర్

ఈ నెల 6 నుంచి పత్తి కొనుగోళ్లు యథావిధిగా కొనసాగుతాయని కలెక్టర్ సత్య శారద తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి, ఏపీసీ, కార్యదర్శి, సీఎండీ-సీసీఐతో పాటు జీఎంఎస్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డితో జరిగిన చర్చల ఫలితంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.జిల్లా వ్యాప్తంగా మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లుల వద్ద కొనుగోళ్లు యథావిధిగా కొనసాగుతాయని కలెక్టర్ వెల్లడించారు. దీంతో నేటి నుంచి చేపట్టాల్సిన సమ్మె వాయిదా పడింది.
News November 6, 2025
పొత్కపల్లి రైల్వే స్టేషన్‌కు ఘన చరిత్ర.. మరిస్తే ఎట్లా..?

నిజాం నవాబు ప్రభుత్వం నాటి నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న పొత్కపల్లి రైల్వే స్టేషన్ నుంచి గతంలో నాగ్‌పూర్‌కు మిరప ఎగుమతులు జరిగేవని, బొగ్గు ఇంజిన్లకు నీటి వసతి కలిగిన ముఖ్య కేంద్రంగా ఈ స్టేషన్ ఉండేదని గ్రామస్థులు తెలిపారు. 40 గ్రామాలకు అనుకూలంగా ఉన్న ఈ స్టేషన్‌ను నిర్వీర్యం చేయడం తగదని, అమృత్ భారత్ పథకంలో దీనిని చేర్చి అభివృద్ధి చేయాలని స్థానిక ప్రజలు రైల్వే అధికారులను కోరుతున్నారు.
News November 6, 2025
రోజూ ఉదయాన్నే పఠించాల్సిన మంత్రం

కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ |
కరమూలే తు గోవింద ప్రభాతే కరదర్శనం ||
అర్థం: మన అరచేతి ముందు భాగంలో (వేళ్ల చివర) లక్ష్మీ దేవి (సంపద), మధ్య భాగంలో సరస్వతీ దేవి (జ్ఞానం), మూలంలో గోవిందుడు (శక్తి) నివసిస్తారు. అందుకే ఉదయం వేళ చేతులను చూసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. ఈ మంత్రాన్ని నిద్ర లేవగానే పఠిస్తే ఆ రోజు సానుకూలంగా మొదలవుతుందని, రోజంతా దైవశక్తి తోడుగా ఉంటుందని నమ్మకం. <<-se>>#shlokam<<>>


