News February 19, 2025

ఆత్రేయపురం: గాయపడిన మహిళ మృతి

image

ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామానికి చెందిన చిట్టూరి లక్ష్మీకాంతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేశామని ఎస్సై రాము తెలిపారు. ఈ నెల 14న ఇంట్లో పెట్రోలు కింద పడి మంటలు చెలరేగటంతో లక్ష్మీ, పెద్ద కొడుకు సాయికృష్ణ గాయపడ్డారు. కాగా తీవ్రంగా గాయపడిన లక్ష్మీకాంతం చికిత్స పొందుతూ మృతి చెందారన్నారు.

Similar News

News December 29, 2025

మేడారంలో అధికారులకు ఎస్పీ సూచనలు

image

మేడారం మహా జాతర సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను ఎస్పీ సుధీర్ రామనాథన్ కేకన్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. జాతర సందర్భంగా ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రాంతాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు వివరించారు. ముందస్తు మొక్కులు చెల్లిస్తున్న భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. ఆయన వెంట జిల్లా పోలీసు అధికారులు ఉన్నారు.

News December 29, 2025

జగిత్యాల: జిల్లా వ్యాప్తంగా పటిష్ఠ పోలీసు బందోబస్తు

image

జిల్లాలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. DEC 31 సాయంత్రం 6 గంటల నుంచి జిల్లా వ్యాప్తంగా పటిష్ఠ పోలీసు బందోబస్తు, నిరంతర పెట్రోలింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. అనుమతి లేకుండా వేడుకలు, డీజేలు పెట్టవద్దన్నారు. ర్యాష్ డ్రైవింగ్, మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలుంటాయన్నారు.

News December 29, 2025

ఖమ్మం: చైనా మాంజా విక్రయించిన వినియోగించిన చర్యలు: సీపీ

image

పక్షులతో పాటు, ప్రజలకు ప్రమాదకరంగా మారిన చైనా మాంజాను ఎవరైనా విక్రయించిన, వినియోగించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఈ చైనా మాంజా (సింథటిక్ దారం, గాజు పొడి) చాలా ప్రమాదకరమని చెప్పారు. ఈ దారాన్ని ఉపయోగించడం ద్వారా పక్షుల గొంతు, రెక్కలు తెగిపోవడం, మనుషులకు గాయాలవుతాయన్నారు. ఎవరైనా చైనా మాంజాను విక్రయిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.