News February 19, 2025

యాదాద్రి: రేపు ఛలో విద్యుత్ సౌదాకు పిలుపు

image

తమను కన్వర్షన్ చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిజన్లు రేపు ఛలో విద్యుత్ సౌధాకు పిలుపునిచ్చారు. TVAC-JAC ఆధ్వర్యంలో చేపట్టే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఆర్టిజన్లు డిమాండ్ చేస్తున్నారు. విద్యా అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రేపటి ధర్నాను విజయవంతం చేయాలని కోరుతున్నారు.

Similar News

News November 5, 2025

NGKL: భక్తి జ్వాలలో ప్రకాశిస్తున్న కార్తీక పౌర్ణమి

image

నాగర్ కర్నూల్ జిల్లావ్యాప్తంగా ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి, దీపాలు వెలిగించి, శివలింగానికి అభిషేకాలు చేస్తున్నారు. ఆలయాల ప్రాంగణాలు దీపాల కాంతులతో వెలిగిపోతుండగా, భజనలు, హారతులతో భక్తి వాతావరణం నెలకొంది. కాగా, ఈరోజు పుణ్యకార్యాలు, దానధర్మాలు చేయడం అత్యంత శుభమని పురాణాలు చెబుతున్నాయి.

News November 5, 2025

వరంగల్: 95 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

image

మద్యం తాగి వాహనాలు నడపటం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఈ తనిఖీల్లో మొత్తం 95 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ విభాగంలో 53, సెంట్రల్ జోన్ పరిధిలో 18, వెస్ట్ జోన్ పరిధిలో 15 ఈస్ట్ జోన్ పరిధిలో 9 కేసులను పోలీసులు నమోదు చేశారు.

News November 5, 2025

నేడు కార్తీక పౌర్ణమి.. మాంసాహారానికి దూరంగా ఉండాలన్న పండితులు

image

అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు మాంసాహారానికి దూరంగా ఉండాలని, శాకాహారమే తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఉపవాసం ఆచరించి నియమాలు పాటిస్తే శుభఫలితాలు పొందుతారని, సాయంత్రం దీపారాధన తర్వాత పండ్లు తినొచ్చని అంటున్నారు. అలాగే ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయాలని, ఈ రోజు వెండి పాత్రలు, పాలను ఎవరికీ దానం చేయకూడదని పేర్కొంటున్నారు. ఇంట్లో ఏ మూలా చీకటి ఉండకూడదని వివరిస్తున్నారు.