News February 19, 2025

ఐఏఎస్‌లు బానిసల్లా పనిచేయొద్దు: ఈటల

image

TG: కాంగ్రెస్ పాలనలో అధికారుల తీరుపై ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్‌లు నేతలకు బానిసల్లా పనిచేయొద్దని అన్నారు. ప్రభుత్వాలు ఐదేళ్లే ఉంటాయని, ఐఏఎస్‌లు 35 ఏళ్లు ఉంటారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. నేతలకు అనుగుణంగా పనిచేసేవారు గతంలో జైలు పాలయ్యారని చెప్పారు. తాము కాషాయ బుక్ మెంటైన్ చేస్తున్నామని, అలాంటి వారు కచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు.

Similar News

News February 22, 2025

WPL: ఆర్సీబీపై ముంబై గెలుపు

image

WPLలో ఆర్సీబీ, ముంబై మధ్య జరిగిన తాజా మ్యాచ్‌లో ముంబై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన RCB పెర్రీ(81, 43 బంతుల్లో) చెలరేగడంతో 167 రన్స్ చేసింది. ఛేజింగ్‌లో బ్యాటర్లు హర్మన్‌ప్రీత్(50, 38 బంతుల్లో), సివర్ బ్రంట్(42, 21 బంతుల్లో) మెరుపులతో మరో బంతి మిగిలుండగానే ముంబై లక్ష్యాన్ని ఛేదించింది.

News February 22, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 22, 2025

ఫిబ్రవరి 22: చరిత్రలో ఈరోజు

image

1847-ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మరణం (కుడివైపు ఫొటో)
1866: స్వాతంత్య్ర సమరయోధుడు కొండా వెంకటప్పయ్య జననం (ఎడమవైపు ఫొటో)
1944: కస్తూర్బా గాంధీ మరణం
1958: భారత తొలి విద్యాశాఖామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ మరణం
1966: సినీ దర్శకుడు తేజ జననం
1983: దివంగత నటుడు నందమూరి తారకరత్న జననం
2019: సినీ దర్శకుడు కోడి రామకృష్ణ మరణం

error: Content is protected !!