News February 19, 2025

‘బుక్’ పాలిటిక్స్

image

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడిదే ట్రెండ్ నడుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు TDP జాతీయ ప్రధాని కార్యదర్శి లోకేశ్ ‘రెడ్’ బుక్ మెయింటేన్ చేస్తున్నామని ప్రకటించారు. తమను ఇబ్బంది పెట్టిన వారి భరతం పడతామని చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న BRS MLC కవిత కూడా ఇటీవల ‘పింక్’ బుక్‌ అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా BJP MP ఈటల ‘కాషాయ’ బుక్ మెయింటేన్ చేస్తున్నట్లు చెప్పారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News February 22, 2025

‘బాయ్‌కాట్ ఓయో’ ట్రెండింగ్.. వివరణ ఇచ్చిన సంస్థ

image

<<15536319>>తమ ప్రకటనపై ‘బాయ్‌కాట్ ఓయో’ ట్రెండ్<<>> అవుతుండటంతో ఓయో స్పందించింది. ‘అయోధ్య, వారణాశి, ప్రయాగరాజ్ తదితర పవిత్ర ఆధ్యాత్మిక ప్రదేశాల్లోనూ మేం సేవలందిస్తున్నాం. ఆ విషయాన్ని చెప్పడమే ఆ యాడ్ వెనుక ఉద్దేశం తప్ప మనోభావాలను దెబ్బతీయడం కాదు. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని వృద్ధి చేయాలనేది మా లక్ష్యం. పురాతన సంప్రదాయాలకు నెలవైన మన దేశంలోని విశ్వాసాల పట్ల మాకు అపారమైన గౌరవం ఉంది’ అని వివరణ ఇచ్చింది.

News February 22, 2025

ఏప్రిల్‌లో మత్స్యకార భరోసా: మంత్రి అచ్చెన్న

image

AP: మత్స్యకారులకు వేట నిషేధ సమయమైన ఏప్రిల్‌లో ‘మత్స్యకార భరోసా’ కింద రూ.20వేలు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అలాగే, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పీఎం కిసాన్‌కు తోడు అన్నదాత సుఖీభవ (రూ.20వేలు) తోడ్పాటు అందిస్తామని వివరించారు. రాష్ట్రానికి 24% ఆదాయం వ్యవసాయం నుంచే వస్తోందని, జగన్ ఆ రంగానికి నష్టం చేకూర్చారని ఆరోపించారు. రాష్ట్రాన్ని 50ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని ధ్వజమెత్తారు.

News February 22, 2025

WPL: ఆర్సీబీపై ముంబై గెలుపు

image

WPLలో ఆర్సీబీ, ముంబై మధ్య జరిగిన తాజా మ్యాచ్‌లో ముంబై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన RCB పెర్రీ(81, 43 బంతుల్లో) చెలరేగడంతో 167 రన్స్ చేసింది. ఛేజింగ్‌లో బ్యాటర్లు హర్మన్‌ప్రీత్(50, 38 బంతుల్లో), సివర్ బ్రంట్(42, 21 బంతుల్లో) మెరుపులతో మరో బంతి మిగిలుండగానే ముంబై లక్ష్యాన్ని ఛేదించింది.

error: Content is protected !!