News February 19, 2025
ప్రకాశం జిల్లాలో నేటి నుంచి ఆధార్ క్యాంపులు

ప్రకాశం జిల్లా పరిధిలో ఇవాళ్టి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ప్రతి మండలంలో సెలక్ట్ చేసిన సచివాలయాల్లో ఆధార్ సేవలు అందిస్తారు. కొత్తగా ఆధార్ కార్డు నమోదు, పాత కార్డులో వివరాల అప్‌డేట్, మొబైల్ లింకింగ్, చిన్న పిల్లల ఆధార్ నమోదు తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి. మీకు దగ్గరలోని సచివాలయాలను సంప్రదిస్తే.. ఏ సచివాలయంలో ఆధార్ సేవలు అందిస్తారో మీకు చెబుతారు.
Similar News
News April 23, 2025
వీరయ్య చౌదరి ఒంటిపై 53 కత్తిపోట్లు: CM

వీరయ్య చౌదరి లాంటి నేతను కోల్పోవడం చాలా బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. అమ్మనబ్రోలులో ఆయన మాట్లాడుతూ.. ‘నారా లోకేశ్, అమరావతి రైతుల పాదయాత్రలో వీరయ్య కీలకంగా ఉన్నారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నా. వీరయ్య ఒంటిపై 53 కత్తిపోట్లు ఉన్నాయి. ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టను. ఎక్కడ దాక్కున్నా లాక్కొని వస్తా’ అని సీఎం హెచ్చరించారు.
News April 23, 2025
వీరయ్య చౌదరికి CM నివాళి

నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులోని వీరయ్య చౌదరి నివాసానికి CM చంద్రబాబు చేరుకున్నారు. వీరయ్య మృతదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు.
News April 23, 2025
అలకూరపాడు జడ్పీ హై స్కూల్ విద్యార్థినికి 595 మార్కులు

టంగుటూరు మండలంలోని అలకూరపాడు జిల్లా ఉన్నత పాఠశాల విద్యార్థిని పుట్ట వెంకట భార్గవి 10వ తరగతి ఫలితాల్లో సత్తా చాటింది. బుధవారం విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో 600 గాను 595 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో నిలిచింది. ఈ సందర్భంగా బాలికను పాఠశాల ఉపాధ్యాయులు, మండల విద్యశాఖధికారులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.