News February 19, 2025

సలామ్ DIIs: 45 రోజుల్లోనే రూ.లక్ష కోట్ల పెట్టుబడి

image

స్వదేశీ సంస్థాగత మదుపరులు (DII) భారత స్టాక్ మార్కెట్లకు ఆపద్బాంధవులుగా మారారు. FM నిర్మలా సీతారామన్ చెప్పినట్టుగానే రిటైల్ ఇన్వెస్టర్లతో కలిసి FIIల పెట్టుబడుల ఉపసంహరణను పూర్తిగా అబ్జార్బ్ చేసుకుంటున్నారు. 2025లో 45 రోజుల్లోనే రూ.1.2లక్షల కోట్లను ఈక్విటీల్లో కుమ్మరించారు. FIIలు వెనక్కి తీసుకున్న రూ.1.6 లక్షల కోట్లతో ఇది దాదాపుగా సమానం. 2024లోనూ DIIలు రూ.5.22 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడం విశేషం.

Similar News

News February 22, 2025

ఏప్రిల్‌లో మత్స్యకార భరోసా: మంత్రి అచ్చెన్న

image

AP: మత్స్యకారులకు వేట నిషేధ సమయమైన ఏప్రిల్‌లో ‘మత్స్యకార భరోసా’ కింద రూ.20వేలు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అలాగే, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పీఎం కిసాన్‌కు తోడు అన్నదాత సుఖీభవ (రూ.20వేలు) తోడ్పాటు అందిస్తామని వివరించారు. రాష్ట్రానికి 24% ఆదాయం వ్యవసాయం నుంచే వస్తోందని, జగన్ ఆ రంగానికి నష్టం చేకూర్చారని ఆరోపించారు. రాష్ట్రాన్ని 50ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని ధ్వజమెత్తారు.

News February 22, 2025

WPL: ఆర్సీబీపై ముంబై గెలుపు

image

WPLలో ఆర్సీబీ, ముంబై మధ్య జరిగిన తాజా మ్యాచ్‌లో ముంబై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన RCB పెర్రీ(81, 43 బంతుల్లో) చెలరేగడంతో 167 రన్స్ చేసింది. ఛేజింగ్‌లో బ్యాటర్లు హర్మన్‌ప్రీత్(50, 38 బంతుల్లో), సివర్ బ్రంట్(42, 21 బంతుల్లో) మెరుపులతో మరో బంతి మిగిలుండగానే ముంబై లక్ష్యాన్ని ఛేదించింది.

News February 22, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

error: Content is protected !!