News February 19, 2025
మంచిర్యాల: 49 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు

మంచిర్యాల జిల్లాలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే 10వ తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు సూచించారు. జిల్లాలో 49 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, 9,189 మంది రెగ్యులర్, 221 మంది విద్యార్థులు సప్లీలు రాయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.
Similar News
News November 9, 2025
NLG: చేతిలో పైసల్లేవ్.. కష్టంగా కుటుంబ పోషణ!

నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తున్న తమకు వేతనాలు సకాలంలో అందడం లేదని కాంట్రాక్టు ఉద్యోగులు తెలిపారు. ఏజెన్సీల మధ్య ఉద్యోగులు నలిగిపోతున్నామన్నారు. 7 నెలలుగా జీతాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారన్నారు. ఆస్పత్రి అధికారులు కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతున్నారన్నారు. జీతాలు రాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. చేతిలో పైసల్లేకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందన్నారు.
News November 9, 2025
కాకినాడలో రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

కాకినాడ జిల్లాలో ఈ నెల 10న యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ షాన్ మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటల నుంచి 1 వరకు కాకినాడ కలెక్టరేట్‌లో జరుగుతుందన్నారు. అధికారులు విధిగా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని, అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన అన్నారు.
News November 9, 2025
విశాఖ కలెక్టరేట్‌లో రేపు జరగబోయే PGRS రద్దు

విశాఖ కలెక్టరేట్‌లో రేపు జరగబోయే పీజీఆర్ఎస్‌ను రద్దు చేసినట్లు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం CII పార్ట్‌నర్ షిప్ సమ్మిట్ ఏర్పాట్లలో ఉన్నందున PGRSను తాత్కాలికంగా రద్దు చేశామన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ కోరారు. నవంబర్ 17వ తేదీన PGRS యథావిధిగా నిర్వహిస్తామని చెప్పారు.


