News February 19, 2025
దేశంలో ఎన్ని కంపెనీలు ఉన్నాయో తెలుసా..

2025, జనవరి 31 నాటికి దేశంలో 28లక్షలకు పైగా కంపెనీలు రిజిస్టర్ అయ్యాయని కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీ తెలిపింది. అందులో 65% అంటే 18.1లక్షల కంపెనీలు యాక్టివ్గా ఉన్నాయంది. ఇక 5,216 ఫారిన్ కంపెనీలు నమోదవ్వగా అందులో 63% (3,281) యాక్టివ్గా ఉన్నట్టు పేర్కొంది. మొత్తంగా 9,49,934 కంపెనీలు మూతపడ్డాయని వెల్లడించింది. బిజినెస్ సర్వీసెస్లో 27%, తయారీలో 20%, ట్రేడింగ్లో 13% కంపెనీలు పనిచేస్తున్నాయి.
Similar News
News February 22, 2025
‘ఛావా’పై వ్యాఖ్యలు.. వివరణ ఇచ్చిన నటి

‘ఛావా’ మూవీలో ఔరంగజేబు చేతిలో శంభాజీ అనుభవించిన హింస అంతా కల్పితమని నటి స్వర భాస్కర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె వివరణ ఇచ్చారు. ‘నా ట్వీట్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఛత్రపతి శివాజీ ఘనతల్ని గౌరవిస్తాను. గత వైభవం పేరు చెప్పి నేడు చేస్తున్న తప్పుల్ని కప్పిపుచ్చకండి అని చెప్పడమే నా ఉద్దేశం. చరిత్ర అందర్నీ కలిపేదిగా ఉండాలని కానీ విడదీసేలా కాదు’ అని సూచించారు.
News February 22, 2025
టర్కీ అధ్యక్షుడిపై భారత్ ఆగ్రహం

టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ఇటీవల పాక్లో పర్యటించినప్పుడు కశ్మీర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చర్చల ద్వారా కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలని, ప్రజల ఆశల్ని దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు. ఆ మాటలపై భారత్ తీవ్రంగా మండిపడింది. ‘కశ్మీర్ అనేది పూర్తిగా మా సార్వభౌమత్వంలోనిది. ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం. టర్కీ రాయబారి వద్ద మా నిరసనను వ్యక్తం చేశాం’ అని విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది.
News February 22, 2025
ముస్లింలను త్వరగా పంపించే ఆలోచన లేదు: కర్ణాటక మంత్రి

రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులు పని నుంచి త్వరగా ఇంటికెళ్లేందుకు తెలుగు రాష్ట్రాలు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. కర్ణాటకలోనూ ఆ సదుపాయాన్ని కల్పించాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సీఎం సిద్దరామయ్యకు లేఖ రాశారు. అయితే, తమకు అలాంటి ఆలోచనేమీ లేదని రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర తెలిపారు. అలాంటి ప్రతిపాదననేమీ చూడట్లేదని, ఇతర రాష్ట్రాలేం చేస్తున్నాయన్నది తమకు అనవసరమని ఆయన పేర్కొన్నారు.