News February 19, 2025

ఏలూరు: జిల్లాలో జీబీఎస్ వైరస్ కలకలం

image

ఏలూరు జిల్లాలో జీబీఎస్ వైరస్ కలకలం రేపింది. ఉంగుటూరు మండలానికి చెందిన ఓ మహిళ (30) ఈనెల 18వ తేదీన విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ అయ్యారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెకు జీబీఎస్ వైరస్‌గా అధికారులు నిర్ధారించారు. ఆమెను ప్రభుత్వాసుపత్రి ఐసీయూలో పెట్టి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News October 22, 2025

BELలో 47 పోస్టులకు నోటిఫికేషన్

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) బెంగళూరు 67 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. BE, బీటెక్, BSc(ఇంజినీరింగ్), ME, ఎంటెక్, MCA ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి వయోపరిమితిలో సడలింపు ఉంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.150. SC, ST, PWBDలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. వెబ్‌సైట్: https://bel-india.in/

News October 22, 2025

MDK: గురుకులాల్లో ఖాళీ సీట్లకు దరఖాస్తులు

image

గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకీ దరఖాస్తుల గడువును ఈనెల 23 వరకు పొడిగించినట్లు ఇన్చార్జి డీసీవో పద్మావతి తెలిపారు. రామాయంపేట, కొల్చారం ఎస్సీ గురుకులాల్లో 2025-26 ఏడాదికి 5 నుంచి 9 తరగతులలో మిగిలిపోయిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తిగలవారు ఈ అవకశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈనెల 25న డ్రా పద్ధతిలో ఎంపిక ఉంటుందన్నారు.

News October 22, 2025

ప్రభుత్వ బడుల్లో నేటి నుంచి ఆధార్ నవీకరణ శిబిరాలు

image

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆధార్ వివరాల మార్పు, నవీకరణ కోసం నేటి నేటి నుంచి 31వ తేదీ వరకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 1,55,780 మంది విద్యార్థులు ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించుకోవాల్సి ఉంది. ఇందులో ఎన్టీఆర్ జిల్లాలో 95,251 మంది, కృష్ణా జిల్లాలో 60,529 మంది ఉన్నారు. పిల్లల వివరాలు సరిచేయడం తప్పనిసరి అని అధికారులు తెలిపారు.