News February 19, 2025
ఆరంభంలోనే పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతోంది. కాగా ప్రేక్షకులు లేక కరాచీ స్టేడియం వెలవెలబోతోంది. గ్రౌండ్‌లో ఎక్కడ చూసినా ఖాళీ స్టాండ్స్ దర్శనమిస్తున్నాయి. టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ప్రేక్షకుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో క్రికెట్ ప్రేమికులు పాకిస్థాన్‌ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇంత పెద్ద టోర్నీని చూసేందుకు పాక్ ఫ్యాన్స్ ఆసక్తి చూపడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.
Similar News
News January 13, 2026
గర్భిణులు నువ్వులు తినకూడదా?

పండుగ పిండివంటల్లో ఎక్కువగా నువ్వులను వాడుతుంటారు. వీటిలో ఉండే ఫైబర్ కంటెంట్, విటమిన్లు అనేక అనారోగ్యాలకు చెక్ పెడతాయి. అయితే గర్భిణులు మాత్రం నువ్వులు తినకూడదని చాలామంది చెబుతుంటారు. కానీ ఇది అపోహ మాత్రమే. ఎందుకంటే గర్భిణులు నువ్వులు తినడం వల్ల గర్భాధారణ సమయంలో తల్లికి అవసరం అయ్యే పోషకాలు, క్యాల్షియం, విటమిన్స్, అమినోయాసిడ్స్, ప్రోటీన్స్, ఐరన్ పుష్కలంగా అందుతాయి. కానీ చాలా మితంగా తీసుకోవాలి.
News January 13, 2026
రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్

ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ రిటైర్మెంట్ ప్రకటించారు. మార్చిలో టీమ్ ఇండియాతో జరగబోయే హోమ్ సిరీస్ తర్వాత అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతానన్నారు. 15ఏళ్ల కెరీర్‌లో వికెట్ కీపర్ బ్యాటర్‌గా అన్ని ఫార్మాట్లలో కలిపి 300దాకా మ్యాచులాడారు. 7వేలకు పైగా రన్స్ చేశారు. 275మందిని ఔట్ చేశారు. ’35 ఏళ్ల వయసులోనూ AUS తరఫున ఆడాలనే ఉంది. కానీ నాలో పోటీతత్వం సన్నగిల్లింది’ అని అన్నారు.
News January 13, 2026
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు క్లోజ్

ఏపీలో సంచలనం రేపిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసును విజయవాడ ACB కోర్టు మూసివేసింది. CID నివేదికకు ఆమోదం తెలుపుతూ CM చంద్రబాబు సహా 37 మందిపై విచారణను క్లోజ్ చేసింది. ‘మిస్టేట్ ఆఫ్ ఫ్యాక్ట్’గా నిందితులందరికీ విముక్తి కల్పిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. అటు తీర్పు వెలువరించే ముందు తన వాదనలు వినాలన్న స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అప్పటి ఛైర్మన్ కె.అజయ్ రెడ్డి పిటిషన్‌ను తిరస్కరించింది.


