News February 19, 2025

HYD: గుండెపోటుతో మరో లాయర్ మృతి..!

image

HYDలో నేడు మరో లాయర్ గుండెపోటుతో మృతి చెందారు. తార్నాకకు చెందిన లాయర్ వెంకటరమణ మారేడ్‌పల్లిలోని ఇండియన్ బ్యాంక్‌లో చలానా కట్టేందుకు వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలారని స్థానికులు తెలిపారు. హుటాహటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిన్న హైకోర్టులో వాదనలు వినిపిస్తూనే లాయర్ వేణుగోపాల్ రావు మరణించిన సంగతి తెలిసిందే. వరుస గుండెపోటు మరణాలు HYDలో భయాందోళనలు కలిగిస్తున్నాయి.

Similar News

News September 13, 2025

‘మిరాయ్’ ఐడియా అప్పుడే పుట్టింది: దర్శకుడు కార్తీక్

image

‘మిరాయ్’ మూవీ ఐడియా 2015-16లో పుట్టిందని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని చెప్పారు. చనిపోయిన తన ఫ్రెండ్ అస్థికలు కలిపేందుకు రామేశ్వరం వెళ్తున్న సమయంలో కథకు బీజం పడిందని పేర్కొన్నారు. ఆ సమయంలో గద్ద తనతో పాటు ట్రావెల్ చేస్తున్నట్లు అనిపించిందని, అలా కథ పుట్టిందన్నారు. మిరాయ్ అనేది జపనీస్ పదమని, దానికి అర్థం ఫ్యూచర్ అని తెలిపారు. ఈ మూవీ కథ రాసేందుకు 5-8 ఏళ్లు పట్టిందన్నారు.

News September 13, 2025

ఏలూరు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్‌లో జిల్లాస్థాయి ఎంపిక పోటీలు

image

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అన్ని స్కూల్ యాజమాన్యాల అండర్-14,17 వయసున్న బాల, బాలికల జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నామని జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి అలివేలుమంగ శనివారం తెలిపారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా విద్యార్థుల ఎంపిక ఈనెల 16న స్విమ్మింగ్, వెయిట్ లిఫ్ట్ పోటీలు ASR స్టేడియంలో, 17న కరాటే పోటీలు ఏలూరు రామచంద్రపురం కాస్మో పొలిటిక్స్ క్లబ్‌లో జరుగుతాయి.

News September 13, 2025

ములుగు: అత్యధికంగా వర్షం పడింది ఇక్కడే!

image

ములుగు జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేని వాన కురిసింది. ప్రధానంగా ఏజెన్సీ మండలాలలో భారీ వర్షం పడింది. ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నమోదైన వర్షపాతాన్ని పరిశీలిస్తే.. అత్యధికంగా వెంకటాపురం మండలంలో 106.5 మి.మీ. వర్షం కురిసింది. వాజేడు మండలం ధర్మారంలో 63మి.మీ., వాజేడులో 37మి.మీ., వెంకటాపూర్ లో 28.8మి.మీ., గోవిందరావుపేటలో 23.8మి.మీ., ఏటూరునాగారంలో 22.3మి.మీ. వర్షం పడింది.