News February 19, 2025
అలాంటి వారికే పదవులు: మంత్రి లోకేశ్

AP: మంచి చేస్తున్న ప్రభుత్వంపై YCP దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని TDP శ్రేణులకు మంత్రి లోకేశ్ సూచించారు. తిరుపతి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశమైన ఆయన, పార్టీని బలోపేతం చేసేందుకు ఐకమత్యంగా కృషి చేయాలని కోరారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఎవరు అంకితభావంతో పనిచేశారో తెలుసుకుని వారికే పదవులు ఇస్తామన్నారు. ‘ఎన్నికల్లో గెలిచాం.. తిరుగులేదనే ధోరణి సరికాదు. నిత్యం ప్రజల్లో ఉండాలి’ అని సూచించారు.
Similar News
News March 13, 2025
రోజూ చికెన్ తింటున్నారా?

చికెన్ అంటే ఇష్టపడని నాన్ వెజ్ ప్రియులు ఉండరు. అయితే రోజూ చికెన్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ప్రతి రోజూ తింటే శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగి ఎముకలు, కీళ్ల సమస్యలు వస్తాయంటున్నారు. గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు చికెన్‌కు దూరంగా ఉండటమే మేలని సూచిస్తున్నారు.
News March 13, 2025
నేటి నుంచి 5 రోజులు జాగ్రత్త

TG: రాష్ట్రంలో నేటి నుంచి 18 వరకు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, ములుగు, పెద్దపల్లి, హన్మకొండ, మహబూబాబాద్, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వనపర్తి, గద్వాల్, నారాయణ్ పేట్ జిల్లాల్లో 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది.
News March 13, 2025
డిజిటల్ మోసాల్లో 83,668 వాట్సాప్ అకౌంట్లు బ్లాక్: బండి

డిజిటల్ అరెస్ట్ స్కాముల్లో 3,962 స్కైప్ ఐడీలు, 83,668 వాట్సాప్ ఖాతాలను బ్లాక్ చేసినట్లు హోంశాఖ వెల్లడించింది. సైబర్ నేరగాళ్లు ఈడీ, సీబీఐ వంటి ఏజెన్సీ అధికారులుగా నటిస్తూ మోసాలకు పాల్పడినట్లు రాజ్యసభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ డీఎంకే ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇప్పటివరకు సైబర్ నేరాలపై 13.36 లక్షలకు పైగా ఫిర్యాదులు అందాయని చెప్పారు. సుమారు రూ.4,386 కోట్ల నష్టాన్ని నివారించినట్లు తెలిపారు.