News February 19, 2025
‘ఆరెంజ్’ ఫ్లాప్‌పై నెటిజన్ ట్వీట్.. డైరెక్టర్ రిప్లై!

రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ సినిమాను అప్పట్లో ఫ్లాప్ చేయడంపై ఓ నెటిజన్ మండిపడ్డారు. ‘అప్పుడు హిట్ చేసే వయసు మాకు రాలేదు. ఇంకో 50, 100 ఏళ్ల తర్వాత కూడా ఆరెంజ్ సినిమా క్లాసిక్’ అని రాసుకొచ్చాడు. దీనిపై డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ స్పందించారు. ‘చాలా థాంక్స్. సినీ పరిశ్రమ జీవితంలో అంతర్లీనం. కేవలం కొన్ని భావోద్వేగాలను చూపించాలనుకున్నా. కాబట్టి నాకు ఎటువంటి విచారం లేదు’ అని తెలిపారు.
Similar News
News December 29, 2025
KNR: జిల్లాలో యూరియా నిల్వలు పుష్కలం: కలెక్టర్

కరీంనగర్ జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ప్రస్తుతం 4,246 మెట్రిక్ టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, అవసరానికి మించి కొనుగోలు చేయవద్దని కోరారు. విక్రయ కేంద్రాల వద్ద తాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అక్రమ నిల్వలు సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
News December 29, 2025
VHT: థర్డ్ మ్యాచ్ ఆడనున్న కోహ్లీ

విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరఫున కోహ్లీ థర్డ్ మ్యాచ్ ఆడటం కన్ఫర్మ్ అయింది. బెంగళూరులో 2026 JAN 6న రైల్వేస్‌తో మ్యాచులో విరాట్ ఆడుతారని DDCA ప్రెసిడెంట్ రోహన్ జైట్లీ ప్రకటించారు. న్యూజిలాండ్ సిరీస్‌కు వడోదరలో ODI టీమ్ JAN 8లోపు ట్రైనింగ్ కోసం వెళ్లాల్సి ఉంది. ఈ తరుణంలో 6న బెంగళూరులో ఆడి 7న అక్కడ రిపోర్ట్ చేస్తారని సమాచారం.
News December 29, 2025
ఒక్క కాఫీతో కపుల్స్ గొడవలకు ఫుల్‌స్టాప్!

దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు సహజం. గిల్లికజ్జాలు లేకపోతే ఆ సంసారంలో మజా ఉండదు అంటారు. అయితే ఒక్కోసారి మాటామాటా పెరిగి ఈగోకి పోతుంటారు. అది అస్సలు మంచిది కాదని ఫ్యామిలీ కౌన్సిలర్లు హెచ్చరిస్తున్నారు. ‘ఎలాంటి గొడవైనా మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సాయంత్రం ఒక మంచి కాఫీ పెట్టుకుని ఇద్దరూ కూర్చొని మనసు విప్పి మాట్లాడుకుంటే ఏ గొడవైనా ఇట్టే సాల్వ్ అవుతుంది’ అని సూచిస్తున్నారు.


