News February 19, 2025

యాదాద్రి కలెక్టర్‌కు ఆహ్వాన పత్రిక అందజేత

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బంగారు విమాన గోపురం మహా కుంభాభిషేకం సంప్రోక్షణ మహోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని కలెక్టర్ హనుమంతరావును యాదగిరిగుట్ట ఆలయ ఈవో భాస్కర్ రావు కోరారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో ఆయనను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

Similar News

News September 19, 2025

దసరా సెలవుల వేళ.. HYD విద్యార్థులకు గుడ్‌న్యూస్

image

దసరా సెలవులు వచ్చాయంటే విద్యార్థులకు ఆనందమే.. ఆనందం.. సిటీలో ఉన్న లక్షలాది మంది విద్యార్థులు సొంతూరికి వెళతారు. ఈ క్రమంలో వారు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టీసీ ఈడీ రాజశేఖర్‌ తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి వీటిని ఏర్పాటు చేశామన్నారు. బస్సుల వివరాల కోసం 9959226148, /6142, / 6136/ 6129 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.

News September 19, 2025

జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. నిమ్స్‌లో మీడియా సెంటర్

image

నిమ్స్ ఆస్పత్రిలో జర్నలిస్టులు, అధికారులకు వాగ్వాదాలు జరిగిన నేపథ్యంలో మీడియా సెంటర్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. సమాచారం కోసం వచ్చే మీడియా ప్రతినిధుల సౌకర్యార్థం మీడియా సెల్ ఏర్పాటు చేశామని ఆస్పత్రి మీడియా ఇన్‌ఛార్జి సత్యాగౌడ్‌ తెలిపారు. అక్కడే పార్కింగ్‌ సదుపాయమూ కల్పించామన్నారు. జర్నలిస్టులకు సిబ్బంది ద్వారా ఇబ్బందులు ఎదురవుతున్న అంశాలపై యాజమాన్యం దృష్టి సారించిందన్నారు.

News September 19, 2025

రోజూ వాల్‌నట్స్ తింటే ఇన్ని ప్రయోజనాలా?

image

* మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి
* బరువును నియంత్రిస్తాయి
* గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి
* సంతాన సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతాయి
* ఎముకలను బలోపేతం చేస్తాయి
* క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి
* షుగర్ రాకుండా కాపాడుతాయని వైద్యులు చెబుతున్నారు.
Share It