News February 19, 2025
VZM: పెండింగ్ చలానాలు చెల్లించాలి

పెండింగ్‌లో ఉన్న ఈ చలనాలను వాహనదారులు చెల్లించే విధంగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని పోలీస్ అధికారులను ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. తన కార్యాలయంలో బుధవారం మాట్లాడుతూ.. నిబంధనలు అతిక్రమించిన వారిపై ఈ చలనాలు విధించినప్పటికీ చెల్లించడంలో వాహనదారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఈ చలానాలు చెల్లించే వరకు వాహనాలు సీజ్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News February 22, 2025
విజయనగరం: 10వ తరగతి విద్యార్థి మృతి

విజయనగరం జిల్లాలో విషాద ఘటన జరిగింది. డెంకాడ మండలం పినతాడివాడకు చెందిన గంగరాజు కుమారుడు రాజు(17) మెర్సి మిషన్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పెదతాడివాడలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన శుభకార్యానికి అతను వెళ్లాడు. తిరిగి బైకుపై ఇంటికి వస్తుండగా పెదతాడివాడ, పినతాడివాడ గ్రామాల మధ్య ట్రాక్టర్ ట్యాంకర్‌ను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడటంతో అతను చనిపోయాడు.
News February 22, 2025
విజయనగరం వైసీపీ ప్రచార కార్యదర్శిగా బొద్దల

వైసీపీ విజయనగరం జిల్లా ప్రచార కార్యదర్శిగా బొద్దల సత్యనారాయణను నియమిస్తూ అధిష్టానం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడుకు సత్యనారాయణ కృతజ్ఞతలు చెప్పారు. బొబ్బిలి మండలం ముత్తావలస గ్రామానికి చెందిన సత్యనారాయణ సర్పంచిగా పని చేశారు. వైసీపీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
News February 22, 2025
గరివిడి: గుండెపోటుతో కుప్పకూలిన ఉపాధ్యాయుడు

గరివిడి మండలంలోని కొండదాడి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రామారావు(50) గుండెపోటుతో శుక్రవారం మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం పాఠశాలలో ప్రార్థన ముగిసిన తరువాత అసౌకర్యంగా ఉండడంతో రామారావు బాత్ రూమ్ కు వెళ్లారు. ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో అక్కడే కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.