News February 19, 2025
మంచిర్యాల: కేంద్రమంత్రిని కలిసిన ఎంపీ

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వ్యవసాయ మంత్రి గిరిరాజు సింగ్‌ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఎంపీ మాట్లాడుతూ..నియోజకవర్గంలో పత్తి రైతులకు న్యాయం జరిగేలా పత్తి కొనుగోళ్లు వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో పత్తి కొనుగోళ్ళు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారి దృష్టికి తీసుకువెళ్లారు.
Similar News
News November 10, 2025
భువనగిరి: ‘జీవో నంబర్ 34ను అమలు చేయాలి’

దివ్యాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని, జీవో నంబర్ 34ను వెంటనే అమలు చేయాలని సోమవారం కలెక్టర్ హనుమంతరావుకు NPRD జిల్లా అధ్యక్షుడు సురపంగా ప్రకాష్, జిల్లా కార్యదర్శి వనం ఉపేందర్ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి లలిత, జిల్లా ఉపాధ్యక్షురాలు పార్వతి, హరిబాబు, చందు, స్వామి, జెరీష, గోపి, నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
News November 10, 2025
జూబ్లీహిల్స్ బైపోల్ ‘బరిలో పెద్దపల్లి యువకుడు’

పెద్దపల్లి(D) ఓదెల మండలం గూడెంకి చెందిన సిలివేరు శ్రీకాంత్ జమ్మికుంటలో స్థిరపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడ్డారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవడం తమ బాధ్యత అని ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. కాగా, నియోజకవర్గంలో 2,08,561 మంది పురుషులు, 1,92,779 మంది మహిళలు, 25 మంది ఇతర ఓటర్లున్నారు. ఓటు హక్కుతో దేశ ప్రగతిని నిర్మించవచ్చని ప్లకార్డులతో కాలనీల్లో పర్యటించారు.
News November 10, 2025
గృహలబ్ధిదారుల వివరాలు నమోదు చేయండి: DRO

గృహాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి వివరాలను సర్వే చేసి అర్హత ఉన్న వారి వివరాలను యాప్‌లో నమోదు చేయాలని DRO శ్రీనివాసమూర్తి సోమవారం ఆదేశించారు. నవంబర్ 30 వరకు ప్రభుత్వం సర్వేకు సమయం ఇచ్చిందని, లబ్ధిదారుల సర్వే పూర్తి చేసి అప్లోడ్ చేయాలని తెలిపారు. మండల ప్రత్యేకాధికారులు సచివాలయాల తనిఖీ చేసి ప్రొఫార్మాలో వివరాలను నమోదు చేసి సమర్పించాలని సూచించారు.


