News March 21, 2024
బిహార్‌లో భారీ స్థాయిలో సీతమ్మ ఆలయ నిర్మాణం
అయోధ్యలో రామమందిరంలా బిహార్‌లో సీతాదేవి కోసం ఆలయం నిర్మాణం కానుంది. సీతాదేవి జన్మస్థలంగా భావించే సీతామడీ జిల్లాలో ఇప్పుడున్న ఆలయం చుట్టూ 50 ఎకరాలు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయోధ్య ట్రస్ట్ తరహాలో ఒక ట్రస్టును ఏర్పాటు చేసి విరాళాలు సేకరించనుంది. 100 ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయం శిథిలం కావడంతో సీతమ్మ కోసం కొత్త ఆలయ నిర్మాణానికి కసరత్తు చేస్తున్నారు.
Similar News
News November 25, 2024
భూకేటాయింపులు రద్దు చేస్తూ సుప్రీం తీర్పు
TG: జీహెచ్‌ఎంసీ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు భూకేటాయింపులు రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రజా ప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టుల సొసైటీలకు గతంలో ప్రభుత్వాలు భూకేటాయింపులు చేశాయి. వీటిని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు కాగా, సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. ప్రభుత్వానికి సొసైటీలు చెల్లించిన డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది.
News November 25, 2024
DCని కేఎల్, అక్షర్ లీడ్ చేస్తారు: పార్థ్ జిందాల్
వచ్చే IPL సీజన్‌లో DCని కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ లీడ్ చేస్తారని కోఓనర్ పార్థ్ జిందాల్ వెల్లడించారు. ‘మాకు యంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. టాప్ ఆర్డర్‌లో నిలకడ కోసం KLను తీసుకున్నాం. అతను ప్రతి సీజన్‌లో 400+ పరుగులు చేశారు. మా హోమ్ గ్రౌండ్(కోట్లా) అతనికి సరిగ్గా సరిపోతుంది. యంగ్ టీమ్‌ను KL, అక్షర్ గైడ్ చేస్తారు’ అని చెప్పారు. స్టార్క్, మెక్‌గుర్క్, బ్రూక్, అశుతోష్, రిజ్వీని వేలంలో DC దక్కించుకుంది.
News November 25, 2024
బిహార్ విఫల రాష్ట్రం.. చెత్తలో కూరుకుపోయింది: ప్రశాంత్ కిశోర్
బిహార్‌లో 4 స్థానాలకు జరిగిన బైఎలక్షన్‌లో ఘోర ఓటమి తర్వాత జన సురాజ్ లీడర్ ప్రశాంత్ కిశోర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. USలోని బిహారీలతో వర్చువల్‌గా మాట్లాడుతూ ‘బిహార్ ఒక విఫల రాష్ట్రం. అది చెత్తలో కూరుకుపోయింది. సుడాన్‌లో 20ఏళ్లుగా సివిల్ వార్ జరుగుతోంది. అక్కడ ప్రజలు పిల్లల చదువుల గురించి పట్టించుకోరు. అలాంటి పరిస్థితే ఇక్కడా ఉంది. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నాలు తీవ్రతరం చేయాలి’ అని చెప్పారు.