News February 19, 2025
కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ ఫేర్‌లో మిడ్ కెరీర్ ఇంటరాక్షన్ ప్రోగ్రాం

సికింద్రాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్‌ఫేర్ ఈనెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మిడ్-కెరీర్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ నిర్వహించింది. ‘జాతీయ భద్రత, అభివృద్ధికి కొత్త సరిహద్దుగా అంతరిక్షం’ అనే ఇతివృత్తంతో జరిగిన ఈ కార్యక్రమానికి భారత సాయుధ దళాల నుంచి 15 మంది అధికారులు, పౌర సేవల నుంచి 10 మంది అధికారులు హాజరయ్యారు. ప్రభుత్వ సైనిక స్థాయి ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ దేశం ఏరోస్పేస్ అభివృద్ధిపై అవగాహన కల్పించారు.
Similar News
News January 1, 2026
HYD: మెట్రోపై సర్కార్ స్టడీ.. టెక్నికల్ కమిటీల ఏర్పాటు

HYD మెట్రో సర్కారు చేతుల్లోకి రానున్న దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైల్ నిర్వహణ ఎలా ఉండాలనే విషయంపై అధికారులు సమాలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో మెట్రో రైల్‌ను స్టడీ (అధ్యయనం) చేసేందుకు 2 టెక్నికల్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు మెట్రో రైల్ ఎండీ (ఇన్‌ఛార్జి) సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. ఈ కమిటీలు మెట్రోను పరిశీలించి త్వరలో నివేదిక సమర్పిస్తాయన్నారు.
News January 1, 2026
భారత్ అందరిదీ.. RSS చీఫ్ కీలక వ్యాఖ్యలు

డెహ్రాడూన్‌లో త్రిపుర విద్యార్థిపై జరిగిన జాతివివక్ష దాడి నేపథ్యంలో RSS చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘భారతదేశం అందరిది. కులమతాలు, భాష, ప్రాంతం ఆధారంగా ఎవరినీ తక్కువ చేయొద్దు’ అని ఆయన పిలుపునిచ్చారు. విభజన భావాలను వీడి సమానత్వంతో మెలగాలని ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన సభలో సూచించారు. దాడిలో చనిపోయిన విద్యార్థి ఏంజల్ చక్మా మృతి పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ సామాజిక సామరస్యం అవసరమని గుర్తుచేశారు.
News January 1, 2026
బాపట్ల: ఈ-ఆటో వాహనాల ప్రారంభం

పర్యావరణ పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. గురువారం బాపట్ల కలెక్టరేట్ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాకు కేటాయించిన ఈ-ఆటోలు వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. మొదటి విడతగా ఎనిమిది ఆటోలు జిల్లాకు మంజూరైనట్లు వెల్లడించారు. ఎలక్ట్రికల్ ఆటోల ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన వ్యయం తగ్గుతుందని పేర్కొన్నారు.


