News February 19, 2025
ఏడాది పాటు బీఆర్ఎస్ రజతోత్సవాలు: KTR

TG: బీఆర్ఎస్ రజతోత్సవాలను ఒక సంవత్సరం పాటు పండుగలా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు కేటీఆర్ వెల్లడించారు. ఇందు కోసం ఉద్యమ సహచరులతో, పార్టీ ముఖ్యులతో పలు కమిటీలను వారం రోజుల్లో ప్రకటిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలో అన్ని వర్గాల వారిని ఇందులో భాగం చేస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్ 10 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
Similar News
News January 10, 2026
OTTలోకి ‘దండోరా’.. డేట్ ఫిక్స్

శివాజీ, నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘దండోరా’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 14 నుంచి తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. మురళీ కాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన <<18646239>>కామెంట్స్<<>> వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
News January 10, 2026
రాష్ట్రంలో 97 పోస్టులు నోటిఫికేషన్ విడుదల

<
News January 10, 2026
MSVG టికెట్ ధరల పెంపు.. రెండు రోజుల కిందటే అనుమతి?

చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా టికెట్ ధరల <<18817046>>పెంపునకు<<>> TG ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఈ నెల 8వ తేదీ ఉండటంతో 2 రోజుల కిందటే టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. కాసేపట్లో టికెట్ బుకింగ్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తాజాగా జీవో బయటకు రావడం చర్చనీయాంశమైంది. ఈ మూవీ ఎల్లుండి థియేటర్లలోకి రానుండగా, రేపు ప్రీమియర్లు వేయనున్నారు.


