News February 19, 2025
భువనగిరి జిల్లా టాప్ న్యూస్

☞ ఈనెల 23న యాదాద్రికి సీఎం రాక.. ఏర్పాట్లు పరిశీలన ☞ చౌటుప్పల్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం ☞ భువనగిరిలో కలెక్టర్ హనుమంతరావు పర్యటన ☞ సుందరంగా ముస్తాబైన యాదాద్రి క్షేత్రం ☞ భువనగిరి కలెక్టర్కు ఇన్విటేషన్ ☞ HYD బోడుప్పల్లో విగ్రహ ప్రతిష్ఠలో కోమటిరెడ్డి, బీర్ల☞ గుండాలలో నీటి ఎద్దడి
Similar News
News July 5, 2025
ఎల్లుండి ఫలితాలు విడుదల

తెలంగాణ ఐసెట్ ఫలితాలు జులై 7న విడుదల కానున్నాయి. HYD ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సోమవారం మ.3.30 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 8,9 తేదీల్లో రోజుకు రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించారు. జూన్ 21న రెస్పాన్స్ షీట్లు, ప్రిలిమినరీ కీ విడుదల చేశారు. 71,757 మంది పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు.
News July 5, 2025
నిజామాబాద్: భారీ వర్షాల జాడేదీ?

వర్షాకాలం మెుదలై నెలరోజులు దాటినా ఉమ్మడి NZB జిల్లాలో భారీ వర్షాలు కురవటం లేదు. దీంతో చెరువులు, ప్రాజెక్టుల్లోకి వరద నీరు రావటం లేదు. అయినప్పటికీ రైతులు వరినాట్లు వేస్తున్నారు. KMR జిల్లాలో 5,21,448 ఎకరాల్లో పంట సాగు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది జూన్ నెలలోనే చెరువుల్లోకి సగానికి పైగా వరద నీరు రాగా ఈ ఏడాది మాత్రం ఆశించిన స్థాయిలో నీరు రావటం లేదని రైతులు పేర్కొంటున్నారు.
News July 5, 2025
ప్రజలకు మీరు చేసే సత్కారం ఇదేనా?: KTR

TG: సీఎం రేవంత్ రెడ్డి <<16942338>>వ్యాఖ్యలపై<<>> బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ‘మీ PayCM అందరినీ బట్టలిప్పి కొడితే తప్ప ఇందిరా గాంధీ గొప్పతనం అర్థం కాదంటున్నాడు. ప్రజలకు మీరు చేసే సత్కారం ఇదేనా రాహుల్ గాంధీ? తెలంగాణను ఏఐసీసీకి ఏటీఏంగా మార్చినప్పటి నుంచి ఆయన ఏది పడితే అది మాట్లాడటాన్ని అనుమతిస్తున్న మీ విధానాన్ని జనం గమనిస్తూనే ఉన్నారు’ అని ట్వీట్ చేశారు.