News February 20, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లా నేర వార్తల వివరాలు

image

రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని నేరా వార్తల వివరాలు.. సిరిసిల్లలో 22 గంజాయి కేసులు:ఎస్పీ అఖిల్ మహాజన్ @కేసు నమోదు.. రిమాండ్ కు తరలింపు: సీఐ కృష్ణ@ఎల్లారెడ్డిపేట మండలంలో గుడి మెట్ల ధ్వంసం ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు:ఎస్సై రమాకాంత్@ప్రభుత్వ కార్యాలయంలో వ్యక్తి వీరంగం@సోషల్ మీడియాలో అసత్య ప్రచారం..కేసు నమోదు:ఎస్సై శ్రీకాంత్ గౌడ్ @ముస్తాబాద్ మండలంలో పిడిఎస్ రైస్ పట్టివేత:ఎస్సై గణేష్

Similar News

News September 17, 2025

చర్లపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద సంచిలో మహిళ డెడ్‌బాడీ

image

చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. దుండగులు ఆమెను హత్య చేసి, సంచిలో కుక్కి ఆటో స్టాండ్ వద్ద పడేసి వెళ్లినట్లు తెలుస్తోంది. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేపట్టారు.

News September 17, 2025

అనకాపల్లి: రాగల ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు

image

అనకాపల్లి జిల్లాలో రాబోయే ఐదు రోజులు మేఘావృత వాతావరణం నెలకొని తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆర్ఆర్ఎస్ వ్యవసాయ పరిశోధనా స్థానం అధికారి ముకుందరావు తెలిపారు. మంగళవారం జరిగిన వాతావరణ ఆధారిత వ్యవసాయ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News September 17, 2025

విహారయాత్రకు బయలుదేరిన జీవీఎంసీ కార్పొరేటర్లు

image

జీవీఎంసీ కార్పొరేటర్లు విహారయాత్రకు బయలుదేరారు. మొత్తం 83 మంది కార్పొరేటర్లు ఉండగా.. ఇందులో 43 మంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. మేయర్‌తో పాటు జీవీఎంసీ సెక్రెటరీ, అధికారులు బయలుదేరిన వారిలో ఉన్నారు. తొమ్మిది రోజులు జరిగే ఈ అధ్యయన యాత్రలో జైపూర్, జోద్‌పూర్, ఢిల్లీ, తదితర ప్రాంతాల్లో కార్పొరేషన్ ప్రాజెక్టులను పరిశీలిస్తారు. 24న తిరిగి విశాఖ రానున్నట్లు అధికారులు తెలిపారు.