News February 20, 2025
TODAY HEADLINES

☞ ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా
☞ ఛాంపియన్స్ ట్రోఫీ: పాక్‌పై న్యూజిలాండ్ గెలుపు
☞ TGలో విద్యుత్ డిమాండ్ ఆల్ టైం రికార్డు
☞ 100% మళ్లీ అధికారంలోకి వస్తాం: KCR
☞ త్వరలో TGలో 10 స్థానాల్లో ఉప ఎన్నికలు: బండి సంజయ్
☞ 24 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
☞ మిర్చి రైతులను ఆదుకోవాలి.. కేంద్రానికి CM CBN లేఖ
☞ నాకు పోలీస్ భద్రత కల్పించరా?: YS జగన్ ఫైర్
Similar News
News February 22, 2025
ఈ-శ్రమ్ పోర్టల్‌లో 81 లక్షల మంది వివరాల నమోదు

APలో 1.80Cr మంది అసంఘటిత కార్మికులు ఉన్నట్లు కార్మిక శాఖ గుర్తించింది. ఇప్పటి వరకు 81.46L మంది వివరాలను <<8091811>>ఈ-శ్రమ్ పోర్టర్‌లో<<>> నమోదు చేసినట్లు తెలిపింది. వీరిలో 56% మహిళలు, 44% పురుషులు ఉన్నారంది. 18-50ఏళ్ల వ్యక్తులు ఏడాదికి రూ.436 ప్రీమియం చెల్లిస్తే PM జీవన్ జ్యోతి కింద రూ.2లక్షల బీమా అందుతుంది. 18-70 ఏళ్లవారు రూ.20 చెల్లిస్తే PM సురక్ష బీమా యోజన కింద పలు ప్రయోజనాలు లభిస్తాయి.
News February 22, 2025
తండ్రీకొడుకుల సాహసం.. బైక్‌పై కుంభమేళా యాత్ర

144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాకు ఎలాగైనా వెళ్లాలనే తపన ఆ తండ్రీకొడుకులను 3900 KM బైక్‌పై వెళ్లేలా చేసింది. కర్ణాటక ఉడిపిలోని శిర్వకు చెందిన ప్రజ్వల్ తన తండ్రి రాజేంద్ర(52) కోరికను తీర్చేందుకు బైక్‌పై రోజుకు 500KM చొప్పున 4 రోజులు ప్రయాణించి ప్రయాగ్‌రాజ్‌కు తీసుకెళ్లాడు. పవిత్ర స్నానం తర్వాత FEB 10న బయల్దేరి 13న శిర్వకు వచ్చారు. పెట్రోల్ బంకుల్లో టెంట్లలో బస చేస్తూ రూ.20000తో టూర్ ముగించారు.
News February 22, 2025
రూ.లక్ష జీతంతో ఉద్యోగాలు.. గడువు పొడిగింపు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 246 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు పొడిగించింది. ఈ నెల 28 వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. జూనియర్ ఆపరేటర్-215, జూనియర్ అటెండెంట్-23, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ పోస్టులు 8 ఉన్నాయి. ఎంపికైన వారికి ఉద్యోగాన్ని బట్టి రూ.23,000 నుంచి రూ.1,05,000 వరకు జీతం లభిస్తుంది. సీబీటీ, ఇతర టెస్టుల ద్వారా ఎంపిక చేస్తారు.
సైట్: iocl.com