News February 20, 2025

వారబందీ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్

image

వారబంది విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అన్సారియా తెలిపారు. కలెక్టర్ ఇరిగేషన్ అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన జిల్లా సరిహద్దు 85/3 మైలు వద్ద నుంచి వస్తున్న నాగార్జునసాగర్ నీటిని నిరంతరం గమనిస్తూ ఉండాలన్నారు. వస్తున్న నీటిని పరిగణలోకి తీసుకొని జిల్లాలో నీటి అవసరం ఉన్న ప్రాంతాలకు మళ్లించాలని తెలిపారు.

Similar News

News December 26, 2025

ప్రకాశం: పండగలకు ఊరు వెళ్తున్నారా..!

image

సంక్రాంతి సెలవులు రాబోతున్నాయి. దీంతో అందరూ బంధుమిత్రుల గ్రామాలకు తరలి వెళ్తారు. దీంతో కొందరు తాళాలు వేసిన గృహాలను టార్గెట్ చేసి చోరీ చేస్తున్నారన్నారు. ఈ సమయంలో ప్రకాశం పోలీసులు అందించే ఫ్రీ సర్వీస్‌ను సద్వినియోగం చేసుకోవాలని SP హర్షవర్ధన్ రాజు గురువారం కోరారు. LHMS సర్వీస్‌ను ప్రజలు ఉచితంగా పొందాలన్నారు. సమాచారం అందించిన ఇంటిని CC కెమెరాతో నిఘా ఉంచి, భద్రత కల్పిస్తామన్నారు.

News December 25, 2025

ప్రకాశం జిల్లా మెప్మా పీడీపై చర్యలు

image

ప్రకాశం మెప్మా పీడీ శ్రీహరిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో బాపట్ల పీడీని నియమించారు. దాదాపు రూ.10 కోట్లు బోగస్ సంఘాలకు రుణాలుగా ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. మెప్మాలో అవినీతి జరిగిందంటూ గతంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సైతం ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు విచారణ సైతం సాగుతోంది. విచారణ పర్వంలోనే పీడీని సరెండర్ చేయడం విశేషం.

News December 25, 2025

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చిన్నారులకు వైద్య పరీక్షలు

image

ప్రకాశం జిల్లాలో చిన్నారుల ఆరోగ్యానికి మరోసారి ఇచ్చేందుకు చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలను వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు బుధవారం సైతం జిల్లా వ్యాప్తంగా DMHO డాక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశాలతో ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. 0 నుంచి 18 ఏళ్లలోపు విద్యార్థులు 4,04,091 మంది ఉండగా, బాల్యంలో వ్యాధులు ఉన్నవారిగా 314 మందిగా అధికారులు గుర్తించారు.