News February 20, 2025

జీబిఎస్ సిండ్రోమ్‌పై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ 

image

గులియన్ బారి సిండ్రోమ్(జీబిఎస్) వ్యాధిపై వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం వైద్యాధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీబిఎస్, ఇమ్యూనైజేషన్, మాతా శిశుమరణాల నివారణ, తదితర వైద్య పరమైన అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. డిసిహెచ్ఎస్ డా. పాల్ సతీష్, డిఎంహెచ్ఓ డా. ఆర్. మాలిని, డా. నాగేశ్వరరావు పాల్గొన్నారు. 

Similar News

News March 3, 2026

సీఎంతో సమీక్షలో పాల్గొన్న ములుగు కలెక్టర్

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో మంగళవారం సాయంత్రం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ములుగు కలెక్టర్ దివాకర్ టిఎస్ పాల్గొన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాల పురోగతిని సీఎం కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా విద్య, మధ్యాహ్న భోజన పథకాలపై కలెక్టర్లతో చర్చించినట్లు సమాచారం.

News March 3, 2026

వరంగల్ NITతో పరస్పర ఒపందం

image

నీటి వనరులు, జియోస్పేషియల్ శాస్త్రాల రంగంలో పరిశోధన సామర్థ్య నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి ఎన్‌ఐటీ వరంగల్, సర్వే ఆఫ్ ఇండియా–జాతీయ జియో-ఇన్ఫర్మాటిక్స్ సైన్స్ & టెక్నాలజీ సంస్థ మధ్యలో పరస్పర అవగాహన ఒప్పందం జరిగింది. ఎన్‌ఐటీ వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి, ఎన్‌ఐజీఎస్టీ, సర్వే ఆఫ్ ఇండియా హెడ్, అదనపు సర్వేయర్ జనరల్ జి.వరుణ్ కుమార్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

News March 3, 2026

క్యాన్సర్‌తో 2023లో లక్ష మంది మృతి!

image

భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. 1990 నుంచి 2023 మధ్య కాలంలో ఈ కేసులు 477%, మరణాలు 352% పెరిగాయని ‘లాన్సెట్’ నివేదిక తెలిపింది. 2023లోనే దేశంలో 2.03 లక్షల కేసులు, లక్ష మరణాలు సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి ఈ కేసులు 35 లక్షలకు చేరుతాయని అంచనా. ఈ వ్యాధి పట్ల అవగాహన, ముందస్తు పరీక్షలు అత్యవసరమని వాషింగ్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు హెచ్చరించారు.