News February 20, 2025
మెదక్: స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

కేంద్రీయ విద్యాలయం నిర్మాణం చేపట్టడానికి అనువైన స్థలాన్ని గుర్తించే ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులు ఆదేశించారు. బుధవారం హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి, తహశీల్దార్ సింధు రేణుకతో కలిసి కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు.
Similar News
News February 22, 2025
సిద్దిపేట: హోమో సెక్స్‌కు అడ్డు చెప్పాడని హత్య

సిద్దిపేటలో వ్యక్తి<<15521843>> హత్య కేసు<<>>ను పోలీసులు ఛేదించారు. హోమో సెక్స్‌కు అడ్డు చెప్పడంతో హత్య చేసిన వ్యక్తిని గుర్తించి రిమాండ్‌కు తరలించినట్లు ACP మధు తెలిపారు. సిద్దిపేటకు చెందిన శ్రీనుకు కరీంనగర్ జిల్లాకు చెందిన పర్వతం రాజు(40)తో పరిచయం ఉంది. భార్య పిల్లకు దూరంగా ఉంటున్న రాజు.. బుధవారం శ్రీనుకు మద్యం తాగించి హోమో సెక్స్ చేస్తుండగా ప్రతిఘటించాడు. దీంతో తలపై కర్రతో కొట్టడంతో శ్రీను చనిపోయాడు.
News February 22, 2025
అందరికీ రుణమాఫీ.. అదో అందమైన కట్టుకథ: హరీశ్‌రావు

సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. ఇప్పటికీ చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని, రైతుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు. గాంధీ భవన్ వద్ద ధర్నాకు దిగిన రైతు విషయంలో హరీశ్‌రావు స్పందించారు. అందరికీ రుణమాఫీ చేసినట్లు అందమైన కట్టు కథను ప్రచారం చేస్తున్న మిమ్మల్ని నిలదీసేందుకు గాంధీభవన్ దాకా వచ్చిన రైతుకు ఏం సమాధానం చెబుతారు అని హరీశ్ నిలదీశారు.
News February 21, 2025
మెదక్‌లో గ్రాడ్యుయేట్స్ 12,472, టీచర్స్ 1,347 ఓటర్లు

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తోంది. ఈనెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మెదక్ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఓటర్లు 12,472 ఉన్నారు. ఇందులో 8,879 మంది పురుషులు, 3,593 మహిళలున్నారు. ఉపాధ్యాయ ఓటర్లు మొత్తం 1,347 ఉన్నారు. ఇందులో పురుషులు 7,99 మంది, మహిళలు 5,48 మంది ఉన్నారు. ఎమ్మెల్సీ పోలింగ్ కోసం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.