News March 21, 2024
సద్గురుకు ఆపరేషన్.. వైద్యులు ఏమన్నారంటే?

సద్గురుకు జరిగిన ఆపరేషన్‌పై వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ‘తలనొప్పిగా ఉందని సద్గురు ఈనెల 15న ఆస్పత్రిని సంప్రదించారు. MRIలో పుర్రె (ఎముక), మెదడు మధ్య రక్తస్రావమవుతోందని తెలిసింది. 17వ తేదీన తలనొప్పి తీవ్రమై వాంతులు చేసుకున్నారు. దీంతో వెంటనే అత్యవసర ICU బృందం ఆయనకు సక్సెస్‌ఫుల్‌గా ఆపరేషన్ చేసింది. ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఎప్పటిలా ఆయన జోక్స్ వేస్తూ నవ్వులు పూయిస్తున్నారు’ అని తెలిపారు.
Similar News
News July 8, 2025
దాల్చిన చెక్క నీళ్లతో ఎన్ని లాభాలంటే?

దాల్చిన చెక్క నీటిని ఉదయాన్నే తాగితే మంచి లాభాలుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒక కప్పు నీటిలో ఒక దాల్చిన చెక్క ముక్క వేసి 15-20 నిమిషాలు మరిగించాలి. ఆ నీటిని గోరు వెచ్చగా తాగాలి. అది జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తుంది. రక్తప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది. షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
News July 8, 2025
అడ్వాన్స్డ్ ఫీచర్లతో GROK 4.. జులై 8న రిలీజ్

xAI ఆవిష్కరించిన AI చాట్ బాట్ GROKలో కొత్త వర్షన్ రాబోతోంది. GROK 4 కొత్త రిలీజ్ డేట్‌ను ఎలాన్ మస్క్ ప్రకటించారు. జులై 4న జరగాల్సిన ఈ రిలీజ్ బుధవారం(జులై9)కి వాయిదా పడింది. రా.8 గంటలకు రిలీజ్ లైవ్ స్ట్రీమ్ ఉంటుందని మస్క్ ట్వీట్ చేశారు. ఇది ఓ స్పెషలైజ్డ్ కోడింగ్ మోడల్. డెవలపర్స్ కోసం కోడింగ్ ఆటో కంప్లీషన్, డీబగ్గింగ్, IDE ఇంటిగ్రేషన్ ఉంటుంది. రియల్‌టైమ్ డేటా, మల్టీ మోడల్ సపోర్టింగ్ కూడా ఉంటుంది.
News July 8, 2025
మెగా DSCపై తప్పుడు ప్రచారాలు: విద్యాశాఖ

AP: మెగా DSC అభ్యర్థులు పరీక్షలపై వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది. ‘కొన్ని పత్రికలు, SMలో పరీక్షలపై నిరాధార ఆరోపణలు వచ్చాయి. సాఫ్టవేర్ లోపాలు, జవాబు మార్పులు వంటి ఆరోపణలు ధ్రువీకరణ కాలేదు. అధికారిక సమాచారంలేని ప్రచారాలు నమ్మొద్దు. అభ్యర్థుల సహాయం కోసం 8125046997, 7995649286, 7995789286, 9398810958 హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉన్నాయి’ అని పేర్కొంది.