News February 20, 2025

ఛాయా సోమేశ్వరాలయంలో శివరాత్రి ఏర్పాట్ల పరిశీలన 

image

మహాశివరాత్రి సందర్భంగా నల్గొండ సమీపంలోని పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయంలో ఈనెల 25 నుంచి 27 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఆమె బుధవారం ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు. బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News March 13, 2025

వైద్య సిబ్బంది డిప్యుటేషన్లు రద్దు: కలెక్టర్

image

నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇతర ప్రాంతాలలో డిప్యుటేషన్‌లో ఉన్న వారి డిప్యూటేషన్లను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలపై జిల్లా కలెక్టర్ బుధవారం తన ఛాంబర్లో రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డాక్టర్ శివరాం ప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు.

News March 12, 2025

సంకల్ప్ అమలుకు ప్రణాళిక రూపొందించాలి: అదనపు కలెక్టర్

image

నైపుణ్య, శిక్షణ కార్యక్రమాల అమలు కోసం పక్కా ప్రణాళికలు రూపొందించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జే. శ్రీనివాస్ అధికారులకు సూచించారు. ‘స్కిల్ అక్విజిషన్, నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లీ హుడ్ ప్రమోషన్’ (సంకల్ప్) కార్యక్రమంపై జిల్లా ఉపాధి కల్పనా శాఖ అధ్వర్యంలో సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమీక్షలో అయన మాట్లాడారు. సమావేశంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ పాల్గొన్నారు.

News March 12, 2025

భువనగిరి జిల్లాలో 85 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

image

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. పోచంపల్లి మండలంలోని ఓ గ్రామంలో 85 ఏళ్ల వృద్ధురాలిపై ఇద్దరు యువకులు ఆదివారం రాత్రి అత్యాచారానికి పాల్పడ్డారు. సోమవారం వృద్ధురాలి గదిలోకి వెళ్లిన కోడలికి వృద్ధురాలు వివస్త్రగా కనిపించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

error: Content is protected !!