News February 20, 2025
వికారాబాద్: ప్రతి ఒక్కరూ బాలికల విద్యకు ప్రోత్సహించాలి: ట్రైనీ కలెక్టర్

బాలికల విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని శిశు సంక్షేమ శాఖ ఇంఛార్జ్ అధికారి ట్రైన్ కలెక్టర్ ఉమా హారతి తెలిపారు. బుధవారం వికారాబాద్ కేజీబీవీ పాఠశాలలో బేటి బచావో బేటి పఢావో కార్యక్రమం 10ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ బాలికలకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి వారి విద్యకు, భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్నారు.
Similar News
News November 3, 2025
ముంబైలో 70KMల అండర్ గ్రౌండ్ టన్నెల్: MMRDA

నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ముంబై రోడ్లపై ప్రయాణమంటే అక్కడి వారికి రోజూ నరకమే. దాన్నుంచి తప్పించేందుకు MMRDA ఏకంగా 70KM మేర అండర్ గ్రౌండ్ టన్నెల్ మార్గాన్ని నిర్మించనుంది. దీనికి సంబంధించి ఫీజిబిలిటీ రిపోర్టును రూపొందిస్తోంది. మూడు ఫేజ్‌లుగా నిర్మాణం జరగనుంది. అక్కడ నిర్మిస్తున్న అంతర్గత టన్నెల్ మార్గాలకు వేరుగా దీన్ని నిర్మించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ప్రయాణం సాఫీ అవుతుంది.
News November 3, 2025
NGKL: గత ప్రభుత్వం టన్నెల్ పనులు పూర్తిచేయలేకపోయింది: సీఎం

గత పదేళ్లలో 10 కిలోమీటర్ల ఎస్‌ఎల్‌బీసీ (SLBC) టన్నెల్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేకపోయారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై విమర్శలు చేశారు. తమ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సుమారు 30 కి.మీ.ల టన్నెల్ పనులు పూర్తయ్యాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించి పనులు కొనసాగిస్తున్నామని సీఎం తెలిపారు.
News November 3, 2025
నెల్లూరు జైలుకు జోగి రమేష్ తరలింపు

నకిలీ మద్యం కేసులో అరెస్టు అయిన మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రామును నెల్లూరు జైలుకు తరలించనున్నారు. జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాముకు ఈ నెల 13 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో వారిని నెల్లూరుకు తీసుకురానున్నారు. ఓ పక్క జోగి రమేష్ అరెస్టు అన్యాయమని, అక్రమమని వైసీపీ నేతలు నిరసన చేపడుతున్నారు.


