News February 20, 2025
ఉప్పల్: బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ నార్మల్ ఉంటేనే ఆరోగ్యం..!

సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే సాధారణ బరువు, బీపీ, షుగర్ నార్మల్ ఉండాలని ఉప్పల్ UPHC డాక్టర్లు అన్నారు. ఇవి నార్మల్ ఉంటే ఆరోగ్యకరమైన మనస్సు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కళ్లు, కాలేయం, గుండె ఆరోగ్యకరంగా ఉండి మన జీవనం పచ్చని ఆకులు కలిగిన చెట్టుల ఉంటుందన్నారు. అదే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే మానసిక రుగ్మతలు, క్యాన్సర్, గుండెపోటు,కిడ్నీ వైఫల్యాలతో ఎండిపోయిన చెట్టులా మన పరిస్థితి మారుతుందన్నారు.
Similar News
News January 8, 2026
జగిత్యాల: ‘రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు’

రైతు ఉత్పత్తి సంఘాల(ఎఫ్పీఓలు) ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అభివృద్ధి మరింత సులభతరం అవుతుందని జగిత్యాల జిల్లా సహకార అధికారి సి.మనోజ్ కుమార్ తెలిపారు. గురువారం జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో ఎఫ్పీఓలుగా ఎంపికైన పాక్స్లకు సామర్థ్య పెంపుదల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎఫ్పీఓల ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుతాయని, జాతీయ స్థాయి మార్కెట్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
News January 8, 2026
హుజూర్నగర్: నేటి నుంచే ‘సింగిల్ బెడ్రూమ్’ దరఖాస్తుల స్వీకరణ

స్థానిక రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న 2160 సింగిల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైంది. మున్సిపాలిటీ పరిధిలోని అర్హులు ఈ నెల 20వ తేదీ వరకు తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్డీవో శ్రీనివాస్ తెలిపారు. గురువారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతిరోజూ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.
News January 8, 2026
బాపట్ల: రూ.6లక్షల విలువైన వాహనాలు స్వాధీనం

జిల్లాలోని పలు ప్రాంతాల్లో నమోదైన మోటార్ సైకిల్ దొంగతనాలపై పర్చూరు PSI పులి గోపి ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టారు. ఈ క్రమంలో బాపట్ల (మం) కొండబోట్లవారిపాలెం గ్రామానికి చెందిన నిందితుడు ప్రేమ్కుమార్ను పర్చూరు మార్కెట్ యార్డు వద్ద గురువారం అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 3 పల్సర్, 1 డ్యూక్ మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పర్చూరు కోర్టులో హాజరుపరిచారు.


