News February 20, 2025
వాళ్లకు త్రిబుల్ రైడింగ్ ఫైన్ పడింది 14న: పవర్ కట్‌పై ఇన్స్పెక్టర్ స్పందన

‘కరెంటోళ్లకు ఫైన్… ట్రాఫిక్ సిగ్నల్స్‌కి పవర్ కట్’ Way2News కథనంపై మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు స్పందించారు. ఈనెల 14న విద్యుత్ సిబ్బంది త్రిబుల్ రైడింగ్‌తో వెళ్లగా ఓల్డ్ బస్టాండ్ వద్ద ట్రాఫిక్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫైన్ విధించినట్లు చిత్రం పంపారు. అగ్ని ప్రమాదం జరిగింది 17న అన్నారు. ఆరోజు ఫైన్ వేయలేదు, విద్యుత్ సిబ్బంది సిగ్నల్స్, ట్రాఫిక్ స్టేషన్‌కు పవర్ కట్ చేయడం సరికాదని పేర్కొన్నారు.
Similar News
News April 22, 2025
ఉమ్మడి మెదక్ జిల్లాల STATE ర్యాంకులు ఇవే..!

☞ఫస్ట్ ఇయర్ (స్టేట్)
సంగారెడ్డి – 60.20 శాతంతో 13వ ర్యాంక్
సిద్దిపేట – 51.50 శాతంతో 29వ ర్యాంక్
మెదక్- 49.24 శాతంతో 31వ ర్యాంక్
☞సెకండ్ ఇయర్‌లో ..
సంగారెడ్డి – 69.26 శాతంతో 16వ ర్యాంక్
మెదక్ – 61.52 శాతంతో 30వ ర్యాంక్
సిద్దిపేట – 59.56 శాతంతో 31వ ర్యాంక్
News April 22, 2025
Inter Results: మెదక్ జిల్లాలో ఇలా..!

ఇంటర్ ఫలితాల్లో మెదక్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండ్ ఇయర్‌లో 5572 మంది పరీక్షలు రాయగా 3428 మంది ఉత్తీర్ణతతో 61.52 శాతం పాస్ పర్సంటేజీ సాధించారు. ఫస్ట్ ఇయర్‌లో 6153 మందికి 3028 మంది పాసయ్యారు. 49.24 శాతం పాస్ పర్సంటేజీ సాధించారు.
News April 22, 2025
మెదక్: నేడే తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం

జిల్లాలో మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు నేడు విడుదల చేయనుంది. జిల్లాలో మొత్తం విద్యార్థులు 12,484 పరీక్షలు రాశారు. ఇందులో ఒకేషనల్ కలుపుకొని ప్రథమ సంవత్సరం 6,066 మంది, ద్వితీయ సంవత్సరం 6,418 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఐఈఓ మాధవి తెలిపారు. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి. ALL THE BEST