News February 20, 2025

నిర్మల్: అభ్యంతరాల స్వీకరణ గడువు పొడగింపు

image

వైద్య కళాశాలలో ఖాళీల భర్తీకి చేపట్టిన నియామకాల దరఖాస్తులపై అభ్యంతరాల స్వీకరణ గడువు ఈనెల 24 వరకు పెంచినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. జిల్లా వైద్య కళాశాలలో పొరుగు సేవల పద్ధతిన 32 ఖాళీల భర్తీ నియామక ప్రక్రియలో భాగంగా అర్హులైన అభ్యర్థులపై అభ్యంతరాల స్వీకరణ గడువు ఈనెల 20 నుంచి 24వ వరకు పొడిగించినట్లు తెలిపారు.

Similar News

News October 17, 2025

ఈశాన్య రుతుపవనాలు వచ్చేశాయ్: IMD

image

దక్షిణ భారతంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయని IMD వెల్లడించింది. దీంతో ఏపీ, TN, కేరళ, పుదుచ్చేరి, కరైకల్, కర్ణాటక, కేరళ, మాహే వాతావరణ సబ్‌డివిజన్లలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇప్పటికే AP, తమిళనాడు, కేరళల్లో 24 గంటలుగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది రేపటిలోపు అల్పపీడనంగా ఏర్పడి, 48 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశముందంది.

News October 17, 2025

అలిగి అత్తారింటికి ఎందుకు వెళ్లకూడదు?

image

పూర్వం కుమారుడిని సరైన దారిలో పెట్టలేకపోతే అతడిని ఏడాదంతా అత్తారింటికి పంపేవారు. ఇది దాదాపు శిక్షతో సమానం. ఎవరైనా సరే తనవారిపై అలిగి అత్తారింటికి వెళ్లినప్పుడు వారు తమ స్వేచ్ఛను, మానసిక ఆనందాన్ని కోల్పోతారు. వేరే వాతావరణం, నియమాల మధ్య ఉండాల్సి వస్తుంది. కోపం అనేది తాత్కాలికమే. అలిగి వెళ్లడం వల్ల శాశ్వత బంధాలు, వ్యక్తిగత స్వేచ్ఛ దెబ్బతింటాయి. అందుకే అలిగి అత్తారింటికి వెళ్లకూడదని చెబుతారు.

News October 17, 2025

ఇన్‌స్టాలో దీపావళి ఎఫెక్ట్ ట్రై చేశారా?

image

దీపావళి కోసం మెటా సంస్థ ఇన్‌స్టాలో కొత్త ఎఫెక్ట్స్ తీసుకొచ్చింది. వాటిని ట్రై చేసేందుకు ఇన్‌స్టా ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ దగ్గర ‘+’ క్లిక్ చేయండి. మీకు కావాల్సిన ఫొటోని సెలక్ట్ చేసుకోండి. పైన ఉండే బ్రష్ ఐకాన్ క్లిక్ చేయండి. బోటమ్‌లో ఫైర్ వర్క్స్, దియాస్ అని ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో మీకు నచ్చింది సెలక్ట్ చేసుకుంటే AI ఆటోమేటిక్‌గా ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. మీకు నచ్చితే డన్ కొట్టి పోస్ట్ చేసుకోవచ్చు.