News March 21, 2024
విజయవాడ: ఇన్విజిలేటర్‌కు దొరికిన నకిలీ విద్యార్థి

ఓపెన్ టెన్త్ పరీక్షల్లో.. ఒక విద్యార్థికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ ఇన్విజిలేటర్‌కు పట్టుబడ్డారు. దీంతో పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్ విజయలక్ష్మి అజిత్ సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సీతారామయ్య అనే విద్యార్థికి బదులు జోసెఫ్ అనే విద్యార్థి పరీక్ష రాస్తున్నట్లు గుర్తించామని చెప్పారు.
Similar News
News March 15, 2026
మచిలీపట్నంలో రేపు మీకోసం: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని సూచించారు.
News March 15, 2026
కృష్ణా: కమర్షియల్ గ్యాస్ సిలెండర్ల కొరత.. భారంగా హోటల్స్ నిర్వహణ

కృష్ణా జిల్లాలో కమర్షియల్ గ్యాస్ సిలెండర్ల కొరత ఏర్పడింది. గత వారం రోజులుగా హోటల్స్ & రెస్టారెంట్లకు కమర్షియల్ గ్యాస్ సిలెండర్ల సరఫరా నిలిచిపోవడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో హోటల్స్ నిర్వహణ భారంగా మారిందని వ్యాపారులు అంటున్నారు. ఇదిలా ఉండగా సిలెండర్ల కొరతను అదునుగా చూసుకొని కొంత మంది అక్రమార్కులు బ్లాక్ మార్కెట్‌కు తెర లేపారన్న విమర్శలు విపినిస్తున్నాయి.
News March 15, 2026
మచిలీపట్నంలో చికెన్ ధరల హీట్.. కేజీ ఎంతంటే!

మచిలీపట్నం మాంసం మార్కెట్లలో ఆదివారం ధరలు భగ్గుమన్నాయి. పట్టణ ప్రాంతంలో మటన్ ధర కేజీ రూ.1000కి చేరగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ.800గా ఉంది. చికెన్ స్కిన్‌లెస్ కిలో రూ.300 పలుకుతోంది. చేపల మార్కెట్‌లో బొచ్చె కిలో రూ.200, సీలావతి రూ.170కి విక్రయిస్తున్నారు. సెలవు దినం కావడంతో మార్కెట్లు రద్దీగా మారాయి. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.


