News February 20, 2025

KNR: మార్చి 5 నుంచి 22 వరకు ఇంటర్ పరీక్షలు: జిల్లా విద్యాధికారి

image

మార్చి 5 నుంచి 22 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయని జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం 10 ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఇంటర్ ప్రథమ సంవత్సరం 17799, ద్వితీయ సంవత్సరానికి 17763 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. మొత్తం 58 సెంటర్లు ఏర్పాటు చేశామని కరీంనగర్లో 37 సెంటర్లు ఉన్నాయన్నారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

Similar News

News January 21, 2026

KNR: పోలీసుల మానసిక ఉల్లాసానికి ‘శౌర్య’ఇండోర్ గేమ్స్

image

కరీంనగర్ పోలీసు కమిషనరేట్‌లో అత్యాధునిక వసతులతో ఏర్పాటుచేసిన ‘శౌర్య’ ఇండోర్ గేమ్స్ హాల్‌ను సీపీ గౌష్ ఆలం బుధవారం ప్రారంభించారు. నిరంతరం విధులతో ఒత్తిడికి గురయ్యే సిబ్బంది మానసిక ఉల్లాసం కోసం పాత భవనాన్ని పునరుద్ధరించి టేబుల్ టెన్నిస్, స్నూకర్స్, క్యారమ్స్ వంటి సౌకర్యాలు కల్పించారు. హోంగార్డు నుంచి కమిషనర్ వరకు అందరికీ ఇవి అందుబాటులో ఉంటాయని సీపీ తెలిపారు.

News January 21, 2026

KNR: ఎన్‌సీసీ క్యాడెట్లకు సీపీ ప్రశంసలు

image

ఎన్నికల విధులు, ట్రాఫిక్ నియంత్రణలో విశేష సేవలందించిన ఎన్‌సీసీ క్యాడెట్లను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అభినందించారు. అస్త్ర కన్వెన్షన్ హాలులో వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. క్రమశిక్షణతో పోలీసులకు అండగా నిలిచిన క్యాడెట్ల సేవలు అభినందనీయమన్నారు. భవిష్యత్తులోనూ వీరి సేవలను వినియోగించుకుంటామని సీపీ పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఎన్‌సీసీ అధికారులు పాల్గొన్నారు.

News January 21, 2026

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్థానం

image

కరీంనగర్ మున్సిపాలిటీ 1941లో ఏర్పడి, 2005 మార్చి 5న మున్సిపల్ కార్పొరేషన్‌గా రూపాంతరం చెందింది, ఇది మొదట థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీగా 1952లో ప్రారంభమై, 1959లో సెకండ్ గ్రేడ్, 1984లో ఫస్ట్ గ్రేడ్, 1996లో స్పెషల్ గ్రేడ్, 1999లో సెలక్షన్ గ్రేడ్ స్థాయికి చేరింది. ఇది సయ్యద్ కరీముద్దీన్ పేరు మీదుగా ఏర్పడి, ఎలగందుల నుంచి జిల్లా కేంద్రంగా మారిన తర్వాత నగర పాలక సంస్థగా విస్తరించింది.