News February 20, 2025
సింగరేణి కార్మికులకు రూ.కోటి అదనపు ప్రమాద బీమా

సింగరేణి కార్మికులకు యాజమాన్యం రూ.కోటి రూపాయల ప్రమాద బీమా అదనపు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు 4జాతీయ బ్యాంకులు SBI,UBI, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడాలతో ఒప్పందం కుదురుచుకున్నట్లు వెల్ఫేర్ జీఎం పర్సనల్ తెలిపారు. సింగరేణి ఉద్యోగులు సంబంధిత బ్యాంకుల నుంచి వేతనం ఖాతాలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులు తమ వేతనాల ఖాతాలను సంబంధిత బ్యాంకు శాఖలలో తీసుకోవాలన్నారు.
Similar News
News July 4, 2025
నిర్మల్ కలెక్టరేట్‌లో ఘనంగా రోశయ్య జయంతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ డా.కొణిజేటి రోశయ్య జయంతి వేడుకలను శుక్రవారం నిర్మల్ కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు కలిసి రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
News July 4, 2025
బహిరంగ ప్రదేశాల్లో నిషేధాజ్ఞలు: KNR సీపీ

సాధారణ పౌరులు, ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని KNR కమీషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను ఈ నెల 31 వరకు పొడిగించినట్లు KNR CP గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ఘర్షనలకు పాల్పడుతున్న మందుబాబులపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలకు ఉపక్రమించినట్లు సీపీ పేర్కొన్నారు.
News July 4, 2025
దేశ వ్యతిరేక పోస్టులపై కఠిన చర్యలు?

దేశానికి వ్యతిరేకంగా కంటెంట్ క్రియేట్ చేసే వారికి చుక్కలు చూపించేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం కేంద్ర హోంశాఖ కొత్త పాలసీని రూపొందిస్తున్నట్లు సమాచారం. వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో పెట్టే కంటెంట్‌ను పరిశీలించి, దేశ వ్యతిరేక పోస్టులను గుర్తించేందుకు ఓ టీమ్‌ను ఏర్పాటు చేయనుంది. ఆయా అకౌంట్లను బ్లాక్ చేయడంతో పాటు పోస్ట్ చేసిన వారిపైనా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి.