News February 20, 2025
రాజానగరం : రెండు లారీల మధ్య నలిగిపోయి వ్యక్తి మృతి

రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంతమూరు గామన్ బ్రిడ్జిపై బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందాడు. విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు ఇనుప ఊచలు లోడుతో వెళ్తున్న లారీని డ్రైవర్ శ్రీనివాసరావు(45) రోడ్డు పక్కకు ఆపి, టైర్లలో గాలి చెక్ చేస్తుండగా మరో లారీ ఢీకొంది. ప్రమాదంలో రెండు లారీల మధ్య నలిగి, అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడని ఎస్ఐ మనోహర్ తెలిపారు.
Similar News
News February 22, 2025
తూ.గో: బ్యాడ్మింటన్ సాత్విక్ తండ్రి మృతికి మోదీ సంతాపం

అమలాపురానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ తండ్రి కాశీ విశ్వనాథం మృతికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సంతాపం తెలిపారు. విశ్వనాథం మరణం పట్ల పీఎం విచారం వ్యక్తం చేస్తూ తండ్రి ప్రేరణతో సాత్విక్ సాయిరాజ్ బ్యాడ్మింటన్ ఆటగాడిగా ఎదిగిన విధానం ప్రస్తావించారు. విలువలు, కుటుంబానికి అందించిన మార్గదర్శకత, వారి జ్ఞాపకాలు ఎల్లప్పుడూ కుటుంబ సభ్యులను ప్రేరేపిస్తాయని ప్రధాని పేర్కొన్నారు.
News February 22, 2025
రాజమండ్రిలో రెండు జీబీఎస్ కేసులు నమోదు

రాజమండ్రి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శుక్రవారం గులియన్ బారే సిండ్రమ్ జీబీఎస్ కేసులు కలకలం రేపాయి. జనరల్ మెడిసన్ విభాగాధిపతి పీవీవీ సత్యనారాయణ, న్యూరాలజిస్టు నీలిమ బాధితులకు పరీక్షలు చేసి వ్యాధిని నిర్ధారించారు. ధవళేశ్వరానికి చెందిన 36 ఏళ్ల వ్యక్తికి, రాజమండ్రికి చెందిన 38 ఏళ్ల వ్యక్తకి కాళ్లు చచ్చుబడినట్లు అనిపించడంతో జీజీహెచ్‌లో పరీక్షలు చేసి ధృవికరించారు. కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.
News February 21, 2025
RJY: మహాశివరాత్రి వేడుకలపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష

భక్తులకు అత్యంత భక్తి ప్రాధాన్యమైన మహాశివరాత్రి పర్వదిన మహోత్సవాల ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. శైవ క్షేత్రాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు.