News February 20, 2025
ఎలమంచిలి: రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

అనకాపల్లి జిల్లాలో నిన్న జరిగిన రెండు ప్రమాదాల్లో ఇద్దరు చనిపోయారు. ఎలమంచిలికి చెందిన డి.సన్యాసిరావు బైకుపై వస్తుండగా.. లైనుకొత్తూరు వద్ద లారీ ఢీకొట్టడంతో మృతిచెందారు. అలాగే రేగుపాలెం వద్ద మరో ప్రమాదం జరిగింది. రాజాన మోహన్(24) బైకుపై వస్తూ రోడ్డు పక్కన వృద్ధుడిని ఢీకొట్టాడు. ఆ తర్వాత స్పీడ్ కంట్రోల్ చేయలేక ఎదురుగా వచ్చిన కారును ఢీకొట్టాడు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ చనిపోయాడు.
Similar News
News September 15, 2025
సెప్టెంబర్ 17న స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ ప్రారంభం: కలెక్టర్

జనగామలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ‘స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. మహిళలు, పిల్లల ఆరోగ్య సాధికారత కోసం AAM/PHC/CHC/GGHలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెగా ఆరోగ్య శిబిరాలు జరుగుతాయన్నారు. సెప్టెంబర్ 17న MCH చంపక్ హిల్స్‌లో కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు.
News September 15, 2025
ప్రకాశం ఎస్పీ మీకోసంకు 58 ఫిర్యాదులు

ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీకోసం కార్యక్రమానికి 58 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీస్ ఉన్నతాధికారులు, మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మీకోసంకు వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను పోలీసులు అడిగి తెలుసుకున్నారు.
News September 15, 2025
జనగామ కలెక్టరేట్లో పట్టణ అభివృద్ధిపై సమీక్ష

జనగామ కలెక్టరేట్లో నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గంలోని పలు సమస్యలు పరిష్కరించేందుకు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పట్టణంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించేందుకు అదనంగా నిధులు విడుదల చేయాలని, ప్రభుత్వ పథకాలలో తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటించాలని కలెక్టర్‌కు సూచించారు.