News February 20, 2025

గుంతకల్లులో రికార్డు ఉష్ణోగ్రత

image

అనంతపురం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం గుంతకల్లులో రికార్డు ఉష్ణోగ్రత నమోదైంది. ఏకంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

Similar News

News February 22, 2025

శ్రీ సత్యసాయి: తెలుగు టీచర్ సస్పెండ్

image

తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సూర్యనారాయణ రెడ్డిని సస్పెండ్ చేసినట్టు శ్రీ సత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారి కిష్టప్ప తెలిపారు. చెక్ బౌన్స్ కేసులో సూర్యనారాయణ రెడ్డి అరెస్టై అనంతపురం జిల్లా జైలులో ఉన్నారన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అతడిని సస్పెండ్ చేశామన్నారు.

News February 22, 2025

అనంత: హైవేపై రోడ్డు ప్రమాదం

image

పెద్దవడుగూరు మండలం కాసేపల్లి టోల్ ప్లాజా సమీపంలో 44 హైవేపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న బొలెరో వాహనాన్ని వెనుక వైపు నుంచి ప్రైవేట్ వోల్వో బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. బస్సు హైదరాబాదు నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News February 22, 2025

అనంత: గ్రూప్-2 పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

image

అనంతపురం జిల్లాలో అదివారం జరగనున్న గ్రూప్-2 పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు. నగరంలో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించే SSBN, ఎస్.వి డిగ్రీ కళాశాలల్లో ఆయన శుక్రవారం తనిఖీలు చేశారు. అక్కడ అధికారులు చేసిన ఏర్పాట్లపై అరా తీశారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్ష సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

error: Content is protected !!