News February 20, 2025
తిరుపతి: హైవేపై ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

తిరుపతి రూరల్ మండలం, రామంజపల్లి చెక్పోస్ట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని ఇద్దరు స్కూటీపై వెళ్తుండగా ఆర్సీ పురం జంక్షన్ నుంచి ఉప్పరపల్లి వైపు వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 22, 2025
తవణంపల్లి: లారీల మధ్య ఇరుక్కుని వ్యక్తి మృతి

చంద్రగిరి మండలం కాశీపెంట్ల హెరిటేజ్ ఫ్యాక్టరీ వద్ద రెండు లారీల మధ్య ఇరుక్కుని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు తవణంపల్లి మండలం, మారేడుపల్లెకు చెందిన డ్రైవర్ సౌందర్ రాజు (35) గా గుర్తించారు. లారీని పార్క్ చేసి చూసుకొని క్రమంలో మరో లారీ ఢీకొనడంతో లారీల మధ్య ఇరుక్కుని మృతి చెందాడు. విషయం తెలుసుకున్న చంద్రగిరి పోలీసులు మృతదేహాన్ని తిరుపతి రుయా మార్చురీకి తరలించారు.
News February 22, 2025
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి: చిత్తూరు MP

చిత్తూరు పార్లమెంటరీ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలని ఎంపీ దుగ్గుమల్ల ప్రసాదరావు ఒక ప్రకటనలో కోరారు. ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో రహదారులు నెత్తురోడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మానవ తప్పిదాలతో జరుగుతున్న వరుస ప్రమాదాలతో విలువైన ప్రాణాలు గాల్లో కలుస్తున్నట్లు చెప్పారు. వాహనదారులు నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానం చేరుకోవాలన్నారు.
News February 21, 2025
చిత్తూరు: రేపు జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం

జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం ఈనెల22వ తేదీన నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సమావేశం ప్రారంభమవుతుందన్నారు. సంబంధిత అధికారులు, సభ్యులు తప్పకుండా హాజరవ్వాలన్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.