News February 20, 2025
సిరిసిల్ల: భారీగా కోళ్లు మృత్యువాత

చందుర్తి మండలం లింగంపేట గ్రామంలోని పెగ్గర్ల రమేష్ రావు కోళ్ల ఫామ్‌లో కోళ్లు మరణిస్తూనే ఉన్నాయి. రెండు వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఇప్పటివరకూ ఈ ఒక్క ఫారంలోనే 2500 కోళ్లు మరణించాయి. అంతకుముందు మరో వెయ్యి కోళ్లు మృత్యువాతపడ్డాయి. భారీ స్థాయిలో కోళ్లు చనిపోతుండడంతో ఇవి బర్డ్‌ఫ్లూ కారణంగానే చనిపోతున్నట్టు స్థానికులు భావిస్తున్నారు. అధికారులు ఇప్పటివరకు ధ్రువీకరించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News July 5, 2025
సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ కోచ్‌ల పెంపు

సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 4 చొప్పున కోచ్‌లు పెంచినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రస్తుతం ఏసీ ఛైర్ కార్ కోచ్‌లు 14 ఉండగా వాటిని 18 చేసింది. సికింద్రాబాద్ నుంచి ఉ.5.05 గంటలకు బయల్దేరే వందేభారత్(20707) మ.1.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. మళ్లీ అక్కడి నుంచి మ.2.30 గంటలకు బయల్దేరే ట్రైన్(20708) రా.11 గంటలకు సికింద్రాబాద్‌కు వస్తుంది.
News July 5, 2025
జిల్లాలో మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం: కలెక్టర్

మాదకద్రవ్యాల వినియోగం, రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు సంబంధిత అధికారులు బాధ్యతగా పని చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. శుక్రవారం కలక్టరేట్‌లో జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. సమాజానికి చీడ పురుగులా మారిన మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి సమిష్టి కృషి చేసి యువత, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని అధికారులకు సూచించారు. ఎస్పీ శ్రీనివాసరావు ఉన్నారు.
News July 5, 2025
కొత్తగా 157 సర్కారీ బడులు

TG: రాష్ట్రంలో కొత్తగా 157 ప్రభుత్వ స్కూళ్లు ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం 20 మంది విద్యార్థులకు మించి ఉన్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొత్తం 571 బడులు నెలకొల్పాలని సర్కార్ నిర్ణయించింది. ఈక్రమంలోనే గ్రామాల్లో 63, పట్టణాల్లో 94 స్కూళ్లు వెంటనే తెరవాలని DEOలను ఆదేశించింది. ఫర్నీచర్, విద్యాసామగ్రి, ఇతర ఖర్చులకు బడ్జెట్‌ను కలెక్టర్ల ద్వారా సమకూర్చనుంది.