News March 21, 2024

ఖమ్మం జిల్లాలో 21 బెల్ట్ షాపుల సీజ్: కలెక్టర్

image

పార్లమెంట్ ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో రూ.1,69,904 విలువైన మద్యం స్వాధీనం చేసుకుని, 21 బెల్ట్ షాపులను సీజ్ చేశామని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ బుధవారం తెలిపారు. జిల్లాలోని పలుచోట్ల చేపట్టిన తనిఖీల్లో అనుమతి లేకుండా విక్రయిస్తున్న మద్యాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనలను పాటించకుండా మద్యం విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

Similar News

News July 5, 2024

చెక్ బౌన్స్ కేసులో వ్యక్తికి ఆరు నెలల జైలు, 3 లక్షల జరిమానా

image

మణుగూరు: చెక్ బౌన్స్ కేసులో ఓ వ్యక్తికి ఆరు నెలల జైలు, మూడు లక్షల జరిమానాను విధిస్తూ మణుగూరు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నూరిరెడ్డి శుక్రవారం తీర్పునిచ్చారు. గుత్తుల శ్రీనివాసరావు వద్ద సుందరయ్యనగర్‌కి చెందిన చింతల రాజారాం 2015 సంవత్సరంలో 3 లక్షల అప్పుగా తీసుకుని డబ్బు కోసం తిరగ్గా చాలా రోజుల తర్వాత చెక్‌ను ఇచ్చాడు. ఆ చెక్కు బౌన్స్ కావడంతో కోర్టు పై విధంగా తీర్పు చెప్పింది.

News July 5, 2024

ఖమ్మం శివారు రైల్వే పట్టాలపై మృతదేహం 

image

ఖమ్మం రూరల్ మండలం‌ దానావాయిగూడెం వద్ద  రైల్వే పట్టాలపై ఓ గుర్తుతెలియని మృతదేహాం లభ్యమైంది. రైల్వే పోలీసులు మృతదేహాన్ని గుర్తించి సామాజిక సేవకుడు అన్నం శ్రీనివాసరావుకు సమాచారం అందించారు.‌ ఆయన మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని వివరాల కోసం రైల్వే పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ భాస్కర్ రావు పేర్కొన్నారు.

News July 5, 2024

వేరుశనగ నూనె ట్యాంకర్ బోల్తా.. ఎగబడ్డ జనం

image

కాకినాడ నుంచి HYD నూనె లోడుతో వెళుతున్న ట్యాంకర్ దమ్మపేట మండలం మొద్దులగూడెం వద్ద బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోగా ఈ ప్రమాదం జరిగింది. నూనె కోసం జనాలు ఎగబడ్డారు. క్యాన్లలో నింపుకుని వెళ్లారు. కాగా ఈ ప్రమాదంలో డ్రైవర్‌, క్లీనర్‌కు గాయాలయ్యాయి.