News February 20, 2025
మార్చి 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎస్కేఎం ధర్నాలు

TG: సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు మార్చి 5-13 వరకు జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని ఎస్కేఎం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోందని ఆరోపించింది. విద్యుత్ సవరణ బిల్లు విషయంలోనూ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించిందని దుయ్యబట్టింది. ఈ ఆందోళనల్లో రైతులు, వ్యవసాయ కార్మిక సంఘాలు భాగస్వామ్యం కావాలని కోరింది.
Similar News
News January 10, 2026
అమరావతిపై జగన్ అడిగింది అదే: సజ్జల

AP: CM CBN చెబుతున్న అమరావతి మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అని YCP స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల ఆరోపించారు. ‘పెద్ద భవనాల పేరుతో బడ్జెట్ పెంచుతున్నారు. అంత డబ్బు అవసరమా? అని మాత్రమే జగన్ అడిగారు. అమరావతిపై ఆయన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. రాజధాని పేరుతో జగన్ను దూషిస్తున్నారు. అమరావతి టెండర్లలో కొన్ని కంపెనీలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ గురించి సమాధానం చెప్పట్లేదు’ అని విమర్శించారు.
News January 10, 2026
సుధామూర్తి చెప్పిన పేరెంటింగ్ సూత్రాలు

ఈ రోజుల్లో పేరెంటింగ్ అనేది సవాలుగా మారుతోంది. పిల్లలకు చదువు ఒక్కటే కాదు చాలా విషయాలు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందంటున్నారు ఇన్ఫోసిస్ సుధామూర్తి. పిల్లలకు డబ్బు విలువ చెప్పడం, ఎదుటివారిని గౌరవించడం, పుస్తకాలు చదివించడం, సంస్కృతి, సంప్రదాయాల గురించి పిల్లలకు చెప్పడం, పెట్టాల్సిన చోట హద్దులు పెడుతూనే ఇవ్వాల్సిన చోట స్వేచ్ఛ ఇవ్వడంతో పాటు పిల్లలకు పేరెంట్స్ రోల్మోడల్లా ఉండాలంటున్నారు.
News January 10, 2026
అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం: సజ్జల

AP: అమరావతిని YCP చీఫ్ జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదని ఆ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇటీవల జగన్ అమరావతిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన నేపథ్యంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. రాజధానిలోనే జగన్ ఇల్లు, పార్టీ ఆఫీస్ కట్టుకున్నారు. CBN ఇంకా అక్రమ నివాసంలో ఉన్నారు. పాలనా వికేంద్రీకరణలోనూ అమరావతిని తక్కువ చేయలేదు’ అని తెలిపారు.


