News March 21, 2024

ఎంజీఎం ఆసుపత్రి అత్యవసర విభాగానికి తాళం!

image

ఎంజీఎం ఆసుపత్రి అత్యవసర విభాగంలోని ఎక్స్-రే మూడు రోజుల నుంచి పని చేయడం లేదు. దీంతో టెక్నీషియన్లు తాళం వేశారు. అప్పటి నుంచి అత్యవసర రోగులను ఓపీ విభాగంలోని రేడియాలజీకి తీసుకెళ్లి పరీక్షలు చేస్తున్నారు. ఓపీ రేడియాలజీ విభాగం దూరంగా ఉండటం వల్ల రాత్రి వేళ ప్రమాదంలో గాయపడిన వారికి సత్వర చికిత్స అందడం లేదు. ఈ విషయంపై అధికారులు స్పందించి ఎక్స్-రే యంత్రాన్ని మరమ్మతులు చేయించాలని రోగులు కోరుతున్నారు.

Similar News

News March 14, 2026

పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు

image

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో పరీక్షe కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు చేస్తామని సెంట్రల్ జోన్ డీసీపీ ధారా కవిత తెలిపారు. శనివారం నుంచి ఏప్రిల్ 16 వరకు సెక్షన్ 163 BNSS (144) అమల్లో ఉంటుందన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో 150 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద గుమికూడడం, సభలు, ర్యాలీలు నిషేధించగా, 500 మీటర్ల పరిధిలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జిరాక్స్ సెంటర్లు మూసివేయాలన్నారు.

News March 13, 2026

మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయండి: కలెక్టర్

image

SIR మ్యాపింగ్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం, ఆమె జిల్లా అధికారులతో సమీక్షించారు. బూత్ స్థాయి అధికారులకు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని, బూత్ స్థాయి ఏజెంట్ల నియామక ప్రక్రియను వెంటనే చేపట్టాలని ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (RDO)ను కలెక్టర్ ఆదేశించారు.

News March 13, 2026

బ్లాక్‌లో గ్యాస్ అమ్మితే కఠిన చర్యలు: కలెక్టర్ సత్య శారద

image

జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత లేదని, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్‌లో విక్రయిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ సత్య శారద స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా ఎనర్జీ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. నిరంతరాయంగా గ్యాస్ సరఫరాను పర్యవేక్షించాల్సిన బాధ్యత కమిటీపై ఉందన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే డీలర్ల లైసెన్సులను రద్దు చేయడంతో పాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.