News February 20, 2025

రాజాం: జగన్ రాక.. హెలిప్యాడ్ స్థల పరిశీలన

image

నేడు పాలవలస రాజశేఖరం కుటుంబ సభ్యుల పరామర్శ కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం ఒంటి గంటకు పాలకొండ పట్టణానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రానున్నారు. ఈనేపథ్యంలో బుధవారం రాత్రి హెలిప్యాడ్ స్థలాన్ని పాలవలస ధవళేశ్వరరావు, రాజాం నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జ్ డా. తలే.రాజేశ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Similar News

News February 22, 2025

విజయనగరం: 10వ తరగతి విద్యార్థి మృతి

image

విజయనగరం జిల్లాలో విషాద ఘటన జరిగింది. డెంకాడ మండలం పినతాడివాడకు చెందిన గంగరాజు కుమారుడు రాజు(17) మెర్సి మిషన్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పెదతాడివాడలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన శుభకార్యానికి అతను వెళ్లాడు. తిరిగి బైకుపై ఇంటికి వస్తుండగా పెదతాడివాడ, పినతాడివాడ గ్రామాల మధ్య ట్రాక్టర్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడటంతో అతను చనిపోయాడు.

News February 22, 2025

 విజయనగరం వైసీపీ ప్రచార కార్యదర్శిగా బొద్దల

image

వైసీపీ విజయనగరం జిల్లా ప్రచార కార్యదర్శిగా బొద్దల సత్యనారాయణను నియమిస్తూ అధిష్టానం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడుకు సత్యనారాయణ కృతజ్ఞతలు చెప్పారు. బొబ్బిలి మండలం ముత్తావలస గ్రామానికి చెందిన సత్యనారాయణ సర్పంచిగా పని చేశారు. వైసీపీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.

News February 22, 2025

గరివిడి: గుండెపోటుతో కుప్పకూలిన ఉపాధ్యాయుడు

image

గరివిడి మండలంలోని కొండదాడి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రామారావు(50) గుండెపోటుతో శుక్రవారం మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం పాఠశాలలో ప్రార్థన ముగిసిన తరువాత అసౌకర్యంగా ఉండడంతో రామారావు బాత్ రూమ్ కు వెళ్లారు. ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో అక్కడే కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

error: Content is protected !!