News February 20, 2025

మన్యంకొండ హుండీ ఆదాయం రూ.32,39,301

image

మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి హుండీలను బుధవారం ఆలయ అధికారులు లెక్కించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు లెక్కింపు కొనసాగింది. ఆలయం నిర్వహణ అధికారి శ్రీనివాసరాజు పర్యవేక్షణలో లెక్కింపు చేపట్టారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి హుండీ ఆదాయం రూ.32,39,301 వచ్చినట్లు ఆలయ ధర్మకర్త అళహరి మధుసూదన్ కుమార్ తెలిపారు.

Similar News

News November 8, 2025

ఎర్రచందనం దుంగలను పరిశీలిస్తున్న పవన్

image

జిల్లా పర్యటనలో భాగంగా Dy.CM పవన్ కళ్యాణ్ తిరుపతి మంగళంలోని ఎర్రచందనం నిల్వ ఉన్న గోడౌన్‌కు చేరుకున్నారు. ఇందులో భాగంగా ఆయన అక్కడ ఎర్రచందనం దుంగలను పరిశీలించారు. ఎన్ని టన్నుల దుంగలు ఉన్నాయి వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

News November 8, 2025

పెద్దకడబూరులో హోరాహోరీగా పొట్టేళ్ల పందేలు

image

పెద్దకడబూరులో శ్రీ భక్త కనకదాసు జయంతిని పురస్కరించుకుని కురువ సంఘం ఆధ్వర్యంలో శనివారం పొట్టేళ్ల పందాలను టీడీపీ నేతలు రమాకాంతరెడ్డి, మల్లికార్జున ప్రారంభించారు. గ్రామీణ క్రీడలలో భాగమే పొట్టేళ్ల పందేలని గుర్తు చేశారు. ఇందులో గెలుపొందిన పొట్టేళ్లకు నగదు బహుమతులు అందజేస్తామన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నల్ల, నట్టు పొట్టేళ్లకు వేరు వేరుగా పోటీలు నిర్వహించారు.

News November 8, 2025

హైదరాబాద్‌ మెట్రో ఛార్జీల పెంపు లేదు: HMRL

image

HYD మెట్రో ఛార్జీల పెంపు అని వస్తోన్న వార్తలపై HMRL క్లారిటీ ఇచ్చింది. తక్షణమే ఛార్జీలు పెంచే ఆలోచన లేదని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలతోనే మెట్రో సేవలు కొనసాగనున్నాయని స్పష్టం చేశారు. కేంద్రం ఏర్పాటు చేసిన ఛార్జీల నిర్ధారణ కమిటీ సిఫారసుల ఆధారంగా మే 24, 2025 నుంచి ఛార్జీల సవరణ అమలు చేశామని గుర్తు చేశారు. ఛార్జీల పెంపు అవాస్తవమని FactCheck_Telangana ధ్రువీకరించింది.
SHARE IT