News February 20, 2025
వరంగల్: నిన్నటి లాగే తటస్థంగా పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర నిన్నటి లాగే తటస్థంగా ఉంది. సోమవారం, మంగళవారం రూ.6,800 పలికిన క్వింటా పత్తి ధర.. బుధవారం రూ.6,810కి చేరింది. ఈరోజు సైతం అదే ధర పలికింది. గతవారం మొదట్లో రూ.7,200పై చిలుకు పలికిన పత్తి ధర ఈవారం భారీగా తగ్గడంతో పత్తి పండించిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 11, 2026
శ్రీశైలంలో సంక్రాంతి ఉత్సవాల ముఖ్య పూజలు ఇవే!

శ్రీశైలంలో 12 నుంచి సంక్రాంతి ఉత్సవాలు జరగనున్నాయి. అందులో భాగంగా 12 నుంచి 18 వరకు జరిగే ముఖ్య పూజా కార్యక్రమాలు ఇవే..
☞ 12న ధ్వజారోహణ ☞ 13న భృంగివాహనసేవ
☞ 14న కైలాసవాహనసేవ ☞ 15 నందివాహన సేవ, బ్రహ్మోత్సవ కళ్యాణం
☞ 16 రావణవాహనసేవ ☞ 17 పూర్ణాహుతి, త్రిశూలస్నానం, సదస్యం, నాగవల్లి, ధ్వజావరోహణ
☞ 18 అశ్వవాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవం.
★ ఉత్సవాల సందర్భంగా కొన్ని ఆర్జిత సేవల నిలుపుదల
News January 11, 2026
UPSC పరీక్షలకు కొత్త రూల్

UPSC పరీక్షల్లో పారదర్శకత పెంచేందుకు ఇకపై అభ్యర్థులందరికీ ‘ఫేస్ అథెంటికేషన్’ తప్పనిసరి చేశారు. Ai టెక్నాలజీతో పనిచేసే ఈ విధానాన్ని ఇప్పటికే NDA, CDS పరీక్షల్లో పైలట్ ప్రాజెక్టుగా విజయవంతంగా పరీక్షించారు. దీని వల్ల వెరిఫికేషన్ కేవలం 10 సెకన్లలోనే పూర్తవుతుందని, సమయమూ ఆదా అవుతుందని యూపీఎస్సీ ఛైర్మన్ అజయ్ కుమార్ తెలిపారు. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయడం వంటి మోసాలకు ఫేస్ అథెంటికేషన్‌తో చెక్ పడనుంది.
News January 11, 2026
కోడిపందాలు ఆడితే కఠిన చర్యలు: కలెక్టర్

ఈ సంక్రాంతి పండుగను కోడిపందాలు, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి, సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని కలెక్టర్ అపూర్వ భరత్ ప్రజలకు సూచించారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, రాష్ట్ర హైకోర్టు కోడిపందాలను నిషేధించిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. ఎవరైనా పందాల నిర్వహణకు స్థలాలు లీజుకు ఇచ్చినా, పందాలను ప్రోత్సహించినా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


