News February 20, 2025

మందుబాబులకు షాక్.. 20% రేట్లు పెంచనున్న ప్రభుత్వం?

image

TG: రాష్ట్రంలో <<15423502>>బీరు ధరలను పెంచిన<<>> ప్రభుత్వం త్వరలో మద్యంపైనా 15-20 శాతం రేట్ల పెంపునకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ధరల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చీప్ లిక్కర్, బ్రాందీ, విస్కీ, రమ్, వైన్, ప్రీమియం, విదేశీ మద్యంపై రేట్లు పెరుగుతాయని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

Similar News

News November 9, 2025

రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీకి షాకింగ్ కలెక్షన్లు

image

రష్మిక లీడ్ రోల్‌లో నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు ఆశించినస్థాయిలో రావట్లేదు. తొలి రోజు తెలుగు, హిందీలో ₹1.30 కోట్లు, రెండో రోజు ₹2.50 కోట్లు నెట్ కలెక్షన్లు వచ్చినట్లు Sacnilk వెల్లడించింది. ఇవాళ ఆదివారం కావడంతో కలెక్షన్లు పెరగొచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు బుక్ మై షోలో D1 34K టికెట్లు అమ్ముడవగా, D2 68Kకు పెరిగినట్లు గీతా ఆర్ట్స్ పేర్కొంది.

News November 9, 2025

5 రాష్ట్రాల్లో రూ.95 కోట్ల స్కామ్స్.. 81 మంది అరెస్ట్

image

TG: సైబర్ నేరగాళ్లపై రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉక్కుపాదం మోపుతోంది. AP, TN, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలో ఆపరేషన్ చేపట్టి 81 మంది నిందితులను అరెస్ట్ చేసింది. వీరిపై 754 కేసులున్నాయని, రూ.95 కోట్ల విలువైన మోసాలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. వారి నుంచి 84 ఫోన్లు, 101 సిమ్‌లు, 89 బ్యాంక్ పాస్ బుక్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితుల ఖాతాల్లోని రూ.కోట్ల నగదును ఫ్రీజ్ చేశామన్నారు.

News November 9, 2025

కేసీఆర్ తెచ్చిన ఏ పథకాన్నీ రద్దు చేయలేదు: CM రేవంత్

image

TG: KCR తెచ్చిన ఏ పథకాన్నీ తాను రద్దు చేయలేదని, వాటికి అదనంగా మరిన్ని స్కీమ్స్ అమలు చేస్తున్నట్లు CM రేవంత్ తెలిపారు. నాడు అభివృద్ధిని పక్కనపెట్టి ఎలాంటి ప్రయోజనం లేని కమాండ్ కంట్రోల్ సెంటర్, సచివాలయం, ప్రగతిభవన్ మాత్రమే నిర్మించారని విమర్శించారు. ‘నేను SC వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రంగా నిలిపాను. కులగణన చేసి చూపించా. రాష్ట్ర గీతాన్ని అందించా. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించా’ అని రేవంత్ వివరించారు.